For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 3rd Test: ఆ సింపుల్ ప్లాన్‌తోనే విరాట్ కోహ్లీని ఔట్ చేశా: రాబిన్‌సన్‌

 Robinson reveals simple plan to get Virat Kohlis wicket

లీడ్స్: ఇంగ్లండ్‌తో ముగిసిన మూడో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 278 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లండ్.. మరో రోజు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో రోజు ఇంగ్లండ్‌పై పైచేయి సాధించిన భారత్.. నేడు నాలుగో రోజు ప్రారంభం నుంచే వికెట్లను కోల్పోయింది. సెంచరీ చేయడం ఖాయమని భావించిన పుజారా 91 పరుగుల ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే అవుటయ్యాడు. అది మొదలు వికెట్ల ప్రవాహం కొనసాగింది. ఆ తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసి ఊపులో ఉన్నట్టు కనిపించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ అవుట్‌తో భారత జట్టు ఓటమి ఖాయమైంది.

ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ (55: 125 బంతుల్లో 8x4) మంచి టచ్‌లో కనిపించినా.. కీలక సమయంలో మళ్లీ ఇంగ్లండ్ బౌలర్ల ట్రాప్‌లో పడి పేలవంగా వికెట్ చేజార్చుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతుల్ని వెంటాడి వికెట్ చేజార్చుకోవడం ఈ సిరీస్‌లో కోహ్లీకి పరిపాటిగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీని జేమ్స్ అండర్సన్ ఔట్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఓలీ రాబిన్సన్ పెవిలియన్ చేర్చాడు. అండర్సన్, రాబిన్సన్ ఇద్దరూ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతుల్ని సంధించగా.. కోహ్లీ వెంటాడి మరి మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీని ఎలా ఔట్ చేశాడో రాబిన్సన్ చెప్పాడు.

'ఇదంతా ఓ కలలా ఉంది. ఇంగ్లండ్‌ జట్టుకు అందించిన మొదటి విజయంతోనే నాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు పొందడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకు ముందు ఇక్కడ బౌలింగ్‌ని ఆస్వాదించాను. ఇక్కడి పరిస్థితులను ఉపయోగించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మైదానంలో ఐదు వికెట్లు తీయడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను. జిమ్మీతో బౌలింగ్ చేయడం మరియు అతని నుండి నేర్చుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నా. సీనియర్ల సలహాలతో నా ఆట మెరుగైంది. నేను నేర్చుకోవడం మరియు వీలైనంత మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటాను' అని ఓలీ రాబిన్సన్ తెలిపాడు.

'నేను వేసిన ఓవర్‌లో విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు కొట్టాడు. కానీ ఎట్టకేలకి అతని వికెట్‌ని నేను పడగొట్టగలిగాను. కోహ్లీ ఔట్ కోసం ప్లాన్ చాలా సింపుల్. అదేంటంటే.. నాలుగు, ఐదో స్టంప్‌ లైన్‌పై బంతుల్ని వేస్తూ విరాట్ తన శరీరానికి దూరంగా షాట్ ఆడేలా చూడటం. ఆ బంతుల్ని కచ్చితంగా అతడు వెంటాడుతాడని మేము ఊహించాం. సరిగ్గా అదే జరిగింది' అని మ్యాచ్ అనంతరం ఓలి రాబిన్సన్ చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ ఈ బలహీనతని అధిగమించడం కోసం దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌‌తో మాట్లాడాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఇప్పటికే సూచించిన విషయం తెలిసిందే.

భారత్ గెలవాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం కాగా.. లార్డ్స్‌లో జ‌రిగిన‌ రెండో టెస్ట్‌లో కోహ్లీసేన విజ‌యం సాధించింది. దాంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇక లీడ్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ సిరీసును 1-1తో సమం చేసింది. మ‌రో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జ‌రుగాల్సి ఉంది. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి చివరి టెస్ట్ జరగనుంది.

Story first published: Saturday, August 28, 2021, 22:51 [IST]
Other articles published on Aug 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+