
మూడు టెస్టుల్లో 400 పరుగులు..
టీమిండియాతో జరుగుతోన్న అయిదు టెస్టుల సిరీస్‌లో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్ నాటికే 400 పరుగులను పూర్తి చేసుకున్నాడు జో రూట్. తొలి రెండు టెస్టుల ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. బ్యాట్స్‌మెన్‌గా జట్టుకు పూర్తి న్యాయం చేస్తోన్నాడనే విషయం దీనితో స్పష్టమౌతోంది. టెస్టుల్లో ఈ క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా అతనే. జో రూట్ టెస్ట్ క్రికెట్ కేరీర్.. ప్రస్తుతం అత్యున్నత స్థితిలో కొనసాగుతోంది.

కోహ్లీకి భిన్నంగా..
ఒకవంక- టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలతో సతమతమౌతోన్నాడు. విమర్శలను ఎదుర్కొంటోన్నాడు. అతనికి పూర్తి భిన్నంగా ఇంగ్లాండ్ కేప్టెన్ జో రూట్ సత్తా చాటుతోన్నాడు. మ్యాచ్ మ్యాచ్‌కూ రాటుదేలుతోన్నాడు. ఇప్పుడు కూడా అతను క్రీజ్‌లో దూకుడుగా ఆడుతోన్నాడు. వరుస బౌండరీలను బాదేస్తున్నాడు. మరోసారి భారీ స్కోర్ దిశగా తన జట్టును దిశా నిర్దేశం చేస్తున్నట్లు కనిపిస్తోంది జో రూట్.

క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో పరుగులే పరుగులు..
ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా జో రూట్ ఆడింది 11 టెస్ట్ మ్యాచ్‌లే. ఈ 11 మ్యాచ్‌లల్లో 1,280 పరుగులు చేశాడు. ఈ స్థాయిలో పరుగులు చేసిన మరో క్రికెటర్ అతని దరిదాపుల్లో కూడా లేరు. బ్యాటింగ్ యావరేజ్ 67.37. వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 228 పరుగులు. ఈ క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 10 టెస్ట్ మ్యాచుల్లో 709 పరుగులతో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు.

కంప్లీట్ లిస్ట్..
శ్రీలంక బ్యాటింగ్ వెన్నెముక లహిరు తిరిమానె 659 పరుగుతో మూడో స్థానాన్ని ఆక్రమించాడు. భారత్‌కే చెందిన రిషభ్ పంత్ 10 టెస్ట్ మ్యాచుల్లో 646 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 46.14. శ్రీలంక బ్యాట్స్‌మెన్ దిముత్ కరుణరత్నె-624, వెస్టిండీస్ ఓపెనర్ క్రెయిగ్ బ్రేత్‌వైట్ - 556, విండీస్ వీరుడు కైలే మేయర్స్-553, పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఫవాద్ ఆలమ్ 513, బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మొమినుల్ హక్-489, పాకిస్తాన్‌కే చెందిన అజర్ అలీ-469 పరుగులతో మిగిలిన స్థానాల్లో నిలిచారు.

కేరీర్‌లో ఉన్నత స్థితికి..
టీమిండియాతో లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా జో రూట్.. 400 పరుగులను కంప్లీట్ చేసుకున్నారు. అయిదు ఇన్నింగుల్లోనే 400 పరుగులను పూర్తి చేసుకోవడమంటే మాటలు కాదు. టెస్ట్ క్రికెట్ కేరీర్‌లో ప్రస్తుతం జో రూట్ ఓ వెలుగు వెలుగుతున్నాడనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్కోర్ కార్డ్. ప్రస్తుతం హెడింగ్లే టెస్ట్ మ్యాచ్‌లో జో రూట్ దూకుడుగా ఆడుతోన్నాడు. 29 బంతుల్లో నాలుగు ఫోర్లతో 27 పరుగులు చేశాడు. అతనికి నాన్ స్ట్రైక్ ఎండ్‌లో డేవిడ్ మలన్ సహకారాన్ని అందిస్తోన్నాడు.


Click it and Unblock the Notifications












