For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో శకతం బాదిన జో రూట్.. ఇది వరుసగా మూడో సెంచరీ! ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు!!

Ind vs Eng 3rd Test Day 2: Joe Root hits 23rd hundred, Here is list of records

లీడ్స్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అదరగొడుతున్నాడు. ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న రూట్‌.. మరో సెంచరీ చేశాడు. 96 పరుగుల వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఫోర్ బాదిన రూట్ శతకం మార్క్ అందుకున్నాడు. మొత్తంగా 124 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో రూట్ శకతం బాదాడు. రూట్‌కు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం విశేషం. ట్రెంట్ బ్రిడ్జ్, లార్డ్స్ టెస్టుల్లో కూడా రూట్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో ఈ క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా అతనే. రూట్ టెస్ట్ క్రికెట్ కేరీర్.. ప్రస్తుతం అత్యున్నత స్థితిలో కొనసాగుతోంది.

దిగ్గజాల సరసన రూట్:

దిగ్గజాల సరసన రూట్:

టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా జో రూట్ దిగ్గజాల సరసన చేరాడు. గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, స్టీవెన్ స్మిత్ ఇపటివరకు 8 సెంచరీలు చేశారు. భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శతకం సాధించిన రూట్.. ఇప్పుడు వెరిసరాసన చేరాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లండ్ ఆటగాడిగా కూడా మరో రికార్డు నెలకొల్పాడు ఇంగ్లీష్ కెప్టెన్ రూట్. 1947లో డెన్నిస్ కాంప్టన్, 2002లో మైఖేల్ వాన్ ఆరు శతకాలు బాదారు. తాజాగా రూట్ కూడా కాంప్టన్, వాన్ సరసన చేరాడు. రూట్ ఇప్పటికే ఈ సంవత్సరంలో 6 సెంచరీలు చేశాడు. ఇంకా నాలుగు నెలల సమయం ఉన్న నేపథ్యంలో రూట్ సరికొత్త రికార్డు నెలకొల్పనున్నాడు.

 ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సెంచరీలు:

ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సెంచరీలు:

టీమిండియాపై ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా కూడా జో రూట్ మరో రికార్డు నెలకొల్పాడు. 1983లో క్లైవ్ లాయిడ్ నాలుగు సెంచరీలు బాధగా.. 1997లో అరవింద డి సిల్వా కూడా అన్నే శతకాలు బాదాడు. 2002లో ఎస్ చంద్రపాల్

2010లో హషీమ్ ఆమ్లాలు కూడా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగేసి సెంచరీలు టీమిండియాపై చేశారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో శతకం సాధించిన రూట్.. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వీరిని అధిగమించే అవకాశం కూడా రూట్ ముందుండి.

12 మ్యాచ్‌లల్లో 1400 పరుగులు:

12 మ్యాచ్‌లల్లో 1400 పరుగులు:

ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా జో రూట్ ఆడింది 12 టెస్ట్ మ్యాచ్‌లే. ఈ 12 మ్యాచ్‌లల్లో దాదాపుగా 1400 పరుగులు చేశాడు. ఈ స్థాయిలో పరుగులు చేసిన మరో క్రికెటర్ అతని దరిదాపుల్లో కూడా లేరు. బ్యాటింగ్ యావరేజ్ 68. వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 228 పరుగులు. ఈ క్రికెట్ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో రూట్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 10 టెస్ట్ మ్యాచుల్లో 709 పరుగులతో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. లహిరు తిరిమానె 659 పరుగుతో మూడో స్థానాన్ని ఆక్రమించాడు. భారత్‌కే చెందిన రిషభ్ పంత్ 10 టెస్ట్ మ్యాచుల్లో 646 పరుగులు చేశాడు.

 అయిదు ఇన్నింగుల్లోనే 500 పరుగులు:

అయిదు ఇన్నింగుల్లోనే 500 పరుగులు:

టీమిండియాతో లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా జో రూట్.. 494 పరుగులను కంప్లీట్ చేసుకున్నారు. అయిదు ఇన్నింగుల్లోనే దాదాపు 500 పరుగులను పూర్తి చేసుకోవడమంటే మాటలు కాదు. టెస్ట్ క్రికెట్ కేరీర్‌లో ప్రస్తుతం జో రూట్ ఓ వెలుగు వెలుగుతున్నాడనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ పరుగులే. ప్రస్తుతం హెడింగ్లే టెస్ట్ మ్యాచ్‌లో జో రూట్ దూకుడుగా ఆడి ఔట్ అయ్యారు. 121 పరుగులు చేసిన రూట్.. బుమ్రా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. రూట్ సేన ప్రస్తుతం 305 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Story first published: Thursday, August 26, 2021, 22:30 [IST]
Other articles published on Aug 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+