For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: చెలరేగిన ఇంగ్లండ్ పేసర్లు.. 78 పరుగులకే భారత్ ఆలౌట్! గత మ్యాచ్ హీరోలు డకౌట్‌లే!!

Ind vs Eng 3rd Test Day 1: James Anderson, Craig Overton strikes India all-out for 78 runs

హెడ్డింగ్లీ: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఈ రోజు మొదలైన మూడ‌వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ పేసర్లు జేమ్స్ అండ‌ర్స‌న్, ఓలి రాబిన్సన్‌, సామ్ కరన్, క్రెయిగ్ ఓవర్టన్ దెబ్బకు భారత్ 40.4 ఓవర్లలో 78 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన 19 పరుగులే అత్యధికం. అజింక్య రహానే 18 పరుగులు చేయగా.. ఒక్క భారత బ్యాట్స్‌మన్‌ కూడా డబుల్ డిజిట్ అందుకోలేకపోయారు. గత మ్యాచ్ హీరోలు లోకేష్ రాహుల్ డకౌట్ కాగా.. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలు గోల్డెన్ డకౌట్ అయ్యారు. అండ‌ర్స‌న్, ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టగా.. రాబిన్సన్‌, కరన్ తలో రెండు వికెట్లు తీశారు.

షాకిచ్చిన అండ‌ర్స‌న్:

షాకిచ్చిన అండ‌ర్స‌న్:

ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే స్టార్ ఓపెన‌ర్, సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (0; 4 బంతుల్లో) డ‌కౌట‌య్యాడు. జేమ్స్ అండ‌ర్స‌న్ వేసిన తొలి ఓవ‌ర్‌ ఐదవ బంతికే కీప‌ర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి రాహుల్ వెనుదిరిగాడు. బంతిని డ్రైవ్‌ చేయబోగా.. బ్యాటు అంచుకు తగిలి కీపర్‌ చేతుల్లో పడింది. రాహుల్ అనంతరం క్రీజులోకి వచ్చిన టెస్ట్ స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ చేతేశ్వర్ పుజారా (1; 9 బంతుల్లో) కూడా నిరాశపరిచాడు. అండర్సన్‌ వేసిన 4.1వ బంతికి అతడు కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో భారత్ నాలుగు పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

 7 పరుగులకే ఔట్:

7 పరుగులకే ఔట్:

చేతేశ్వర్ పుజారా అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి రాగా.. ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కాపాడుకునేందుకు ప్రయత్నించాడు. జేమ్స్ అండర్సన్‌ నిప్పులు చేరగడంతో తన సహజ శైలికి పూర్తి బిన్నంగా ఆడాడు. అనవసర షాట్లకు పోకుండా క్రీజులో కుదురుకున్నాడు. అయితే అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 10.5 ఓవర్‌కు కోహ్లీ ఔట్ అయ్యాడు. కీపర్‌ బట్లర్‌కి అతడు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో అండర్సన్‌ను ఎదుర్కోవడంలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. 7 పరుగులకే ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్ గతి తప్పింది. విరాట్ అవుట్ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానేతో కలిసి రోహిత్ నిదానంగా ఆడుతూ వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు.

ఆరు బంతుల్లో 4 వికెట్లు:

ఆరు బంతుల్లో 4 వికెట్లు:

అజింక్య రహానే, రోహిత్ శర్మ ఇద్దరూ సమయోచితంగా ఆడారు. రోహిత్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమయినా.. రహానే సింగిల్స్ తీస్తూ స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు. 18 పరుగులు చేసిన రహానే క్రీజులో కుదురుకున్నట్టుగానే కనిపించాడు. అయితే అంతలోనే ఓలి రాబిన్సన్‌కు చిక్కి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం లంచ్ బ్రేక్‌కు వెళ్లింది భారత్. ఇక లంచ్ అనంతరం సామ్ కరన్, క్రెయిగ్ ఓవర్టన్ చెలరేగడంతో భారత్ ఆరు బంతుల్లో 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ (2), రవీంద్ర జడేజా (4), మొహ్మద్ షమీ (0), జస్ప్రీత్ బుమ్రా (0)లు ఔట్ అయ్యారు. ఇషాంత్ శర్మ (8 నాటౌట్) స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేయగా.. మొహ్మద్ సిరాజ్ (3) ఔట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

పోటాపోటీగా వికెట్లు తీస్తూ:

పోటాపోటీగా వికెట్లు తీస్తూ:

ఆతిథ్య బౌలర్లలో జేమ్స్ అండర్సన్ తొలుత భారత జట్టు ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చగా.. ఆ తర్వాత ఓలి రాబిన్సన్, సామ్ కరన్, క్రెయిగ్ ఒవెర్టన్‌లు భారత్ పనిపట్టారు. పోటాపోటీగా వికెట్లు తీస్తూ టీమిండియా బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. వీరిలో అండర్సన్, ఒవెర్టన్‌ చెరో మూడు వికెట్లు తీయగా. రాబిన్సన్, కరన్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ వేగంగా పరుగులు చేస్తోంది.

Story first published: Wednesday, August 25, 2021, 20:23 [IST]
Other articles published on Aug 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+