For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND VS ENG: సంజూ శాంసన్ ఎత్తుగడ.. మూడో టీ20లో అతడిని దెబ్బతీసేందుకు

ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరిగిన రెండు టీ20ల్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు భారత ఆటగాళ్ల దృష్టి హ్యాట్రిక్ విజయంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకోవడంపై ఉంది. రాజ్‌కోట్‌ వేదికగా మూడో టీ20 జరగనుంది.

అయితే తొలి రెండు టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపని సంజూ శాంసన్.. ఎలాగైనా ఇప్పుడు మూడో టీ20లో రాణించాలని పట్టుదలతో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో 26 పరుగులు చేసిన అతడు.. దాన్ని పెద్ద ఇన్నింగ్స్ గా మలచలేకపోయాడు. రెండో టీ20లో పూర్తిగా ఫ్లాప్ అయిపోయాడు. ఐదు పరుగులకే ఔట్ అయిపోయాడు. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ జోఫ్రా ఆర్చర్‌కే వికెట్ సమర్పించుకున్న అతడు.. షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడటంలో కాస్త గట్టిగానే ఇబ్బంది పడ్డాడు.

IND VS ENG 3rd T20 Sanju Samson Special Practice to face Jofra Archer Ahead Of 3rd T20I vs England

దీంతో ఇప్పుడు మూడో టీ20లో అలా జరగకుండా ఉండేందుకు తీవ్ర సాధన చేస్తున్నాడు సంజూ శాంసన్. మఖ్యంగా ఆర్చర్‌కు దొరకకూడదనే ఉద్దేశంతో స్పెషల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దాదాపు 45 నిమిషాల పాటు ప్లాస్టిక్‌ బంతితోనే పుల్, హుక్ షాట్లను ఆడుతూ ప్రాక్టీస్ చేశాడు. ఇంకా ర్యాంప్, కట్ షాట్లను ఆడాడు. క్లైంబింగ్‌ బాల్‌ తోనూ ప్రాక్టీస్ చేశాడు. కొత్త బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్‌ ఆధ్వర్యంలో సిమెంట్ పిచ్‌పై బ్యాటింగ్‌ చేస్తూ సాధన చేశాడు. త్రోడౌన్ స్పెషలిస్టులు కూడా సంజూకు హెల్ప్ చేశారు.

తుది జట్లు

టీమిండియా (అంచనా): సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్

ఇంగ్లాండ్ : జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్‌ సాల్ట్ (వికెట్ కీపర్), లియామ్‌ లివింగ్‌ స్టోన్, జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్, జేమీ ఓవర్టన్, మార్క్‌ వుడ్, జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్‌, బెన్ డకెట్, అదిల్ రషీద్.

Story first published: Tuesday, January 28, 2025, 11:28 [IST]
Other articles published on Jan 28, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+