Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng 3rd T20 : అందుకే నలుగురిని మార్చాం.. రోహిత్ శర్మ క్లారిటీ, బ్యాటింగ్ ఎంచుకున్న బట్లర్..!

Ind vs Eng 3rd T20 Playing 11: England have won the toss and have opted to Bat First

బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్‌పై 2-0తేడాతో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుని జోరు మీదున్న టీమిండియా.. మూడో మ్యాచ్ మీద కూడా కన్నేసింది. రెండో మ్యాచ్ జరిగిన బర్మింగ్‌హామ్ వేదికగానే రాత్రి 7గంటలకు ప్రారంభం కానున్న చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి రోహిత్ సేన సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుండగా.. ఒక్క మ్యాచ్ అయినా గెలిచి ఇంగ్లాండ్ పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. శనివారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 49పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ కూడా గెలిస్తే రోహిత్ ఖాతాలో కెప్టెన్‌గా వరుసగా ఇది 15వ విజయం అవుతుంది. ఇక ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు టాస్ కోసం గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన కెప్టెన్ జాస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక రెండు మ్యాచుల్లో తొలుత బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ భంగపడ్డ సంగతి తెలిసిందే. అందుకే బట్లర్ బ్యాటింగ్ ఎంచుకోవాలని ఫిక్సయ్యాడు.

రెండు మార్పులతో ఇంగ్లాండ్ బరిలోకి..

టాస్ గెలిచిన అనంతరం బట్లర్ మాట్లాడుతూ.. మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. కేవలం మార్పు కోసం చూస్తున్నా. ఇది మంచి వికెట్‌గా కనిపిస్తోంది. మా జట్టు తరఫున రెండు మార్పులు జరిగాయి. రీస్ టోప్లీ, ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చారు. సాల్ట్ బ్యాటింగ్ ఆర్డర్లో 4వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. ఇక పార్కిన్సన్, సామ్ కరన్ జట్టు నుంచి వైదొలిగారు. మాకు గెలుస్తామనే ఆత్మవిశ్వాసముంది.

కొన్ని విషయాలు పరిశీలించాలనుకుంటున్నాం

టాస్ ఓడిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మేం ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని ఉండేవాళ్లం. ఎందుకంటే తొలి రెండు మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్‌ చేశాం. ఈసారి ఛేజింగ్‌ చేయాలనుకున్నాను. లక్కీగా అదే జరిగింది. మా జట్టులో నాలుగు మార్పులు చోటుచేసుకున్నాయి. రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగబోతున్నారు. భువీ, బుమ్రా, చాహల్, హార్దిక్ పాండ్యా స్థానాల్లో వారు జట్టులోకొచ్చారు. మేము మా గెలుపు బాటను కొనసాగించాలనుకుంటున్నాము. అయితే ప్రపంచ కప్‌కు ముందు మేము కొన్ని విషయాలను పరిశీలించాలనుకుంటున్నాం. అందుకే ఈ మార్పులు చేశాం. ఉమ్రాన్ ఆడడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అతనికి శుభాకాంక్షలు. అతను రాణించాలని ఆశిస్తున్నా. అని రోహిత్ చెప్పాడు.

తుది జట్లు

ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్, కెప్టెన్), డేవిడ్ మలన్, ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రీస్ టోప్లీ, రిచర్డ్ గ్లీసన్

Story first published: Sunday, July 10, 2022, 18:53 [IST]
Other articles published on Jul 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+