ఆ ముగ్గురు లేకుంటే మన బౌలింగ్ ఉత్తదే.. చెలరేగిన మలన్, లివింగ్‌స్టోన్.. ఇండియా ముందు భారీ టార్గెట్

బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్‌పై 2-0తేడాతో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుని మూడో మ్యాచ్ కూడా గెలవాలన్న టీమిండియా ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన కెప్టెన్ జాస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక రెండు మ్యాచుల్లో తొలుత బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ భంగపడ్డ సంగతి తెలిసిందే. అందుకే బట్లర్ బ్యాటింగ్ ఎంచుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చింది. భారత బౌలింగ్ విభాగంలో భువీ, బుమ్రా, చాహల్ లాంటి మెయిన్ బౌలర్లు లేకపోవడంతో ఇంగ్లాండ్ బౌలర్లు ఉతుకుడు ఉతికిండ్రు. ఉమ్రాన్ మాలిక్ ఏదో చేస్తాడనుకుంటే.. కొట్టుకోండ్రి అన్నట్లు భారీగా పరుగులు ఇచ్చేశాడు. బౌలర్లు ఎవరూ పెద్దగా ప్రభావవంతంగా బౌలింగ్ వేయకపోవడంతో నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ 215పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డేవిడ్ మలన్ (77పరుగులు 39బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు) హాఫ్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇక అతనికి తోడు లివింగ్‌స్టోన్ (42పరుగులు 29బంతుల్లో 4సిక్సర్లు నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలా 2వికెట్లు, ఆవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక వికెట్ తీశారు.
ఇంగ్లాండ్‌కు శుభారంభం
ఇక బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు మంచి శుభారంభం దక్కింది. తొలి ఓవర్ అవేశ్ ఖాన్ వేయగా కేవలం 2పరుగులు మాత్రమే వచ్చినా.. తర్వాత ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌ను కెప్టెన్ బట్లర్ టార్గెట్ చేశాడు. ఆ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దీంతో 2వ ఓవర్లో 17పరుగులొచ్చాయి. 3వ రవి బిష్ణోయ్ వేయగా.. చివరి బంతికి జాసన్ రాయ్ సిక్స్ కొట్టి తన హిట్టింగ్ మొదలెట్టాడు. ప్రమాదకరంగా మారుతున్న బట్లర్ (18పరుగులు 9బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్)ను అవేశ్ ఖాన్ నాలుగో ఓవర్లో బౌల్డ్ చేశాడు.
డేవిడ్ మలన్ క్యాచ్ డ్రాప్ చేసిన హర్షల్..
5వ ఓవర్ జడేజా వేయగా.. జాసన్ రాయ్ సిక్సు, ఫోర్ కొట్టడంతో పాటు ఆ ఓవర్లో మొత్తం 11పరుగులు వచ్చాయి. ఇక 6వ ఓవర్ హర్షల్ పటేల్ వేయగా.. మలన్ ఫోర్ కొట్టి తన హిట్టింగ్ మొదలెట్టాడు. అయితే 4పరుగుల వద్ద మలన్ ఇచ్చిన క్యాచ్‌ను హర్షల్ పటేల్ జారవిడిచాడు. అది ఇండియాను చాలా దెబ్బతీసింది. ఆ తర్వాత కుదురుకున్న మలన్ వీరవిహారం చేశాడు. ఇక పవర్ ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ 1వికెట్ కోల్పోయి 52పరుగులు చేసింది. ప్రమాదకరంగా మారుతున్న జాసన్ రాయ్ (27పరుగులు 26బంతుల్లో 1ఫోర్, 2సిక్సులు)ను ఉమ్రాన్ మాలిక్ కీపర్ క్యాచ్ ఔట్ చేశాడు. మరోవైపు మలన్ మాత్రం తన దూకుడు ఆపలేదు. అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును నడిపించాడు. ఫిలిప్ సాల్ట్ (8పరుగులు) క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. అతన్ని హర్షల్ పటేల్ ఔట్ చేశాడు.
నాలుగు ఓవర్లలో 56పరుగులు ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్
ఇక ఉమ్రాన్ వేసిన 13వ ఓవర్లో 30బంతుల్లో తన ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మలన్.. ఆ ఓవర్లో ఫోర్, సిక్స్ బాదాడు. క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ తన భీకర హిట్టింగ్ ను కొనసాగించాడు. వీరిద్దరూ బౌలర్ ఎవరనేది చూడకుండా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును ఉరకలెత్తించారు. దీంతో 15ఓవర్లకే స్కోరు 167కు చేరుకుంది. ఇక 17వ ఓవర్లో రవి బిష్ణోయ్ బౌలింగ్లో డేవిడ్ మలన్ (77), మొయిన్ అలీ (0) ఔటయ్యారు. అయినా స్కోరు వేగం మారలేదు. అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ రావడంతో ఆ ఓవర్లో 21పరుగులొచ్చాయి. 19వ ఓవర్ చివరి బంతికి బ్రూక్ (19పరుగులు 9బంతుల్లో 3ఫోర్లు) ఔటయ్యాడు. ఇక చివరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ వేయగా.. జోర్డాన్ ఫోర్, సిక్సు బాదాడు. చివరి బంతికి రనౌట్ అయ్యాడు. ఇక స్కోరు 215పరుగులకు చేరుకుంది. ఇక ఉమ్రాన్ మాలిక్ తన నాలుగు ఓవర్లలో 56పరగులు ఇవ్వడం గమనార్హం.
తుది జట్లు
ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్, కెప్టెన్), డేవిడ్ మలన్, ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రీస్ టోప్లీ, రిచర్డ్ గ్లీసన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications