సూర్య ఇన్నింగ్స్ వల్ల ఛేంజ్ అయిన కొన్ని రికార్డులు ఇవే
ఇక భారత తరఫున టీ20 మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ (118)తర్వాత రెండో స్థానంలో సూర్యకుమార్ (117)నిలిచాడు. ఇక ఒక టీ20 మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన నంబర్ 4బ్యాటర్‌గా స్కై నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు మ్యాక్స్ వెల్ (113)పేరిట ఉండేది. ఇండియా తరఫున ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్లుగా సూర్య (117), శ్రేయస్ అయ్యర్ (28) నిలవగా వీరిద్దరి మధ్య డిఫెరెన్స్ 89పరుగులు. టీ20ల్లో భారత్ తరఫున టాప్ స్కోరర్ల మధ్య ఇదే అత్యధిక డిఫరెన్స్. అంతకుముందు ఈ రికార్డ్ కేఎల్ రాహుల్ (101), రోహిత్ శర్మ (32) పేరిట 2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. అప్పుడు టాప్ స్కోరర్ల మధ్య డిఫెరెన్స్ 69.
కోహ్లీ మళ్లీ నిరాశపరిచాడు...
ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఛేజింగ్‌కు దిగిన ఇండియాకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్ తొలి బంతికి పంత్ (1) కీపర్ క్యాచ్ ఔటయిపోయాడు. డీఆర్ఎస్ రివ్యూ కోరుకోవడంలో పంత్ టైం దాటాక కోరడంతో అంపైర్ కుదరదన్నాడు. అయితే అల్ట్రా ఎడ్జ్‌లో పంత్ ఔటయినట్లు కన్పించింది. ఇక తర్వాత రెండో ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి కాస్త ఊపుతో కన్పించిన కోహ్లీ (11) తర్వాత బంతికి హిట్ చేయాలని చూసి క్యాచ్ ఔటయిపోయాడు. రోహిత్ (11)కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 3వికెట్లు కోల్పోయి కేవలం 34పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో ఇండియా ఓటమి ఇక లాంఛనమే అనిపించింది.
ఇండియా తరఫున నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం
అయితే క్రీజులో సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్ మంచి స్టాండ్ ఇచ్చారు. విల్లీ వేసిన 7వ ఓవర్లో ఫోర్, సిక్సర్‌తో స్కై హిట్టింగ్ షురూ చేశాడు. ఆ ఓవర్లో 15పరుగులొచ్చాయి. 9వ ఓవర్ లివింగ్‌స్టోన్ వేయగా.. ఆ ఓవర్లో 3ఫోర్లు కొట్టి 15పరుగులు పిండుకున్నాడు. 10వ ఓవర్ శ్రేయస్ అయ్యార్ సైతం సిక్సు కొట్టి టచ్లోకి వచ్చాడు. ఇక 12వ ఓవర్లో సూర్య ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 13వ ఓవర్లో సూర్యప్రతాపం మొదలైంది. లివింగ్ స్టోన్ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సులు బాదిన సూర్య 21పరుగులు పిండుకున్నాడు. 14వ ఓవర్లో కూడా గ్లీసన్ బౌలింగ్లో ఫోర్, సిక్స్ బాదాడు. దీంతో శ్రేయస్, సూర్య మధ్య 100పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత 15వ ఓవర్ జోర్డాన్ వేయగా ఆ ఓవర్లో సూర్య రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. తద్వారా ఇండియా తరఫున నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు అయింది. అంతకుముందు ఈ రికార్డు (107) ధోనీ కోహ్లీ మధ్య ఉంది.
శ్రేయస్, డీకే, జడ్డూ త్వరత్వరగా ఔటైపోవడంతో..
ఇక 16వ ఓవర్లో టీమిండియాకు దెబ్బ పడింది. ఎప్పటిలాగే శ్రేయస్ అయ్యార్ (28పరుగులు 23బంతుల్లో 2సిక్సులు) కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి డీకే వచ్చాడు. 17వ ఓవర్ విల్లీ బౌలింగ్లో 3బంతికి ఫోర్ కొట్టిన సూర్య.. టీ20ల్లో తన తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ తర్వాత నంబర్ 4స్థానంలో బ్యాటింగ్ దిగి సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా సూర్య రికార్డ్ నెలకొల్పాడు. దినేష్ కార్తీక్ (6) ఆ ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయిపోయాడు. ఆ తర్వాత వచ్చీ రాగానే సిక్స్ కొట్టిన జడేజా (7)సైతం ఎల్బీడబ్ల్యూగా ఔటయిపోయాడు.
ఇంగ్లాండ్ ప్రేక్షకులు సైతం సూర్యకు స్టాండింగ్ ఓవియేషన్
ఇక చివరి రెండు ఓవర్లలో 12బంతుల్లో 41కావాల్సిన పరిస్థితుల్లో అనూహ్యంగా స్పిన్నర్ మొయిన్ అలీ బౌలింగ్‌కు దిగాడు. ఆఫ్ సైడ్ వేసి బురిడీ కొట్టించాలని చూడగా.. ఫోర్, సిక్స్, ఫోర్‌తో సూర్య బెంబేలెత్తించాడు. దీంతో సమీకరణం 9బంతుల్లో 25గా మారింది. ఇక ఇండియా గెలిచేలా కన్పించింది. 4బంతిని ఆపిన సూర్య అయిదో బంతిని హిట్ చేయాలని చూడగా లాంగాఫ్లో క్యాచ్ ఔటయిపోయాడు. ఇక ఇండియా గెలుపు ఆశలు గల్లంతయ్యాయి. ఇక సూర్య ఔటయ్యాక తీవ్ర నిరాశ చెందాడు. అయితే.. అతని ఇన్నింగ్స్‌కు స్టేడియంలో ఉన్న ఇండియా అభిమానులతో పాటు ఇంగ్లాండ్ ప్రేక్షకులు సైతం స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇక డ్రెస్సింగ్ రూంలో ఉన్న భారత ప్లేయర్లు అందరూ సూర్య డ్రెస్సింగ్ రూంకు వచ్చేదాకా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. నిజమైన పోరాట స్ఫూర్తి కనబర్చిన సూర్యను కామెంటర్లు ప్రశంసలతో ముంచెత్తారు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా భువనేశ్వర్ కుమార్
ఇక 19ఓవర్ చివరి బంతిని హర్షల్ పటేల్ ఫోర్ కొట్టడంతో చివరి ఓవర్లో భారత్ విజయానికి 21పరుగులు అవసరమయ్యాయి. అయితే జోర్డాన్ కట్టుదిట్టంగా వేయడంతో 3పరుగులు మాత్రమే వచ్చాయి. రెండు వికెట్లు పడ్డాయి. దీంతో 9వికెట్లు కోల్పోయి 198పరుగులు మాత్రమే చేయగలిగిన ఇండియా 17పరుగుల తేడాతో ఓటమిపాలయింది. ఫలితంగా సిరీస్ 2-1తేడాతో ఇండియా వశమైంది. అలాగే అభిమానులకు సైతం అసలైన టీ20 మజా కూడా లభించింది. ఇక ఈ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రీస్ తోప్లే (4-1-22-3)కు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.
తొలుత డేవిడ్ మలన్, లివింగ్ స్టోన్ చెలరేగడంతో..
ఇక ఈ మ్యాచ్ టాస్ గెలిచిన కెప్టెన్ జాస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇండియన్ బౌలర్లు ఎవరూ పెద్దగా ప్రభావవంతంగా బౌలింగ్ వేయకపోవడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 215పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డేవిడ్ మలన్ (77 పరుగులు 39బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అతనికి తోడు లివింగ్‌స్టోన్ (42పరుగులు 29బంతుల్లో 4సిక్సర్లు నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ తలా 2వికెట్లు, ఆవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ తలా ఒక వికెట్ తీశారు.
తుది జట్లు
ఇండియా (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి బిష్ణోయ్
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్, కెప్టెన్), డేవిడ్ మలన్, ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రీస్ టోప్లీ, రిచర్డ్ గ్లీసన్


Click it and Unblock the Notifications












