వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా.. ఆఖరిదైన మూడో వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. దీంతో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగుతోంది. ఈ క్రమంలోనే మూడు మార్పులతో మ్యాచ్ బరిలోకి దిగింది టీమిండియా. రవీంద్ర జడేజా, షమీ, వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇవ్వగా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్, అర్ష్‌దీప్ జట్టులోకి ఎంట్రీ వచ్చారు.
నిరాశపరిచిన రోహిత్..
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరో 13 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్ గా నిలిచేవాడు. కానీ అతడు నిరాశపరిచాడు. 2 బంతుల్లో 1 పరుగు చేసి నిరాశపరిచాడు. అలానే వన్డేల్లో మరో మూడు క్యాచులు పడితే.. టీమిండియా తరఫున ఎక్కువ క్యాచులు అందుకున్న క్రికెటర్ గా కోహ్లీ నిలుస్తాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 154 క్యాచులు ఉండగా.. ఈ జాబితాలో అజారుద్దీన్ 156 క్యాచులతో ముందున్నాడు.

టీమిండియా తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సకిబ్ మహమూద్.