Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS ENG 3rd ODI: రోహిత్ శర్మను ఊరిస్తోన్న భారీ రికార్డ్..

టీమిండియా - ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే కోసం రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భారత్ పట్టుదలతో ఉండగా.. గెలిచి పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే

వన్డేల్లో.. రోహిత్ శర్మ మరో 13 పరుగులు సాధిస్తే ఈ ఫార్మాట్ లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా రికార్డుకెక్కుతాడు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ తెందుల్కర్ (276 ఇన్నింగ్స్‌లో), సౌరభ్ గంగూలీ (288 ఇన్నింగ్స్‌లో), జాక్వెస్ కలిస్ (293 ఇన్నింగ్స్‌లో), రికీ పాంటింగ్ (286 ఇన్నింగ్స్‌లో) కన్నా వేగంగా 11 వేల పరుగులు చేసిన క్రికెటర్ గా ఘనత సాధిస్తాడు.

IND VS ENG 3rd ODI Rohit Sharma to score 13 runs for fastest 11 thousand runs in ODI

ఇప్పటికే ఈ వన్డేల్లో అత్యంత వేగంగా 11 వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ తొలి స్థానంలో ఉన్నాడు. 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్క్ ను టచ్ చేశాడు. రోహిత్ 259 ఇన్నింగ్స్‌ల్లో ఇప్పటివరకు 10,987 పరుగులు సాధించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరగబోయే మూడో వన్డేలో హిట్ మ్యాన్ దానిని ఈజీగానే సాధించొచ్చు. పైగా ఇప్పటికే రెండో వన్డే తో సెంచరీ బాది అతడు ఫామ్ లోకి వచ్చాడు.

మూడో భారతక్రికెటర్ గా
ఈ మూడో వన్డేలో రోహిత్ మరో శతకం బాదితే.. భారత తరఫున అంతర్జాతీయ మ్యాచుల్లో 50 సెంచరీలు చేసిన మూడో క్రికెటర్ గా నిలుస్తాడు. వన్డేల్లో రోహిత్ కు ప్రస్తుతం 32వ శతకాలు బాదగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 49 సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు సచిన్ తెందూల్కర్ (100), విరాట్ కోహ్లీ (81).. అంర్జాతీయ క్రికెట్ లో 50కు పైగా శతకాలు చేశారు.

Story first published: Tuesday, February 11, 2025, 17:42 [IST]
Other articles published on Feb 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+