Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్రోఫీ ప్రెజెంటేషన్ వేదికపై సందడే సందడి.. రవిశాస్త్రికి కోహ్లీ, రిషబ్ పంత్ బంపరాఫర్..!

Ind vs Eng 3rd ODI: Rishabh pant giving champagne bottle to ravi shastri

ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్‌లో జరిగిన మూడో వన్డేలో రిషబ్ పంత్ (125పరుగులు 113బంతుల్లో 16ఫోర్లు, 2సిక్సర్లు నాటౌట్), హార్దిక్ పాండ్యా (71పరుగులు 55బంతుల్లో 10ఫోర్లు) చెలరేగడంతో ఇండియా 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వన్డే సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక విజయానంతరం ట్రోఫీ ప్రజెంటేషన్ సెషన్ చాలా సందడిగా జరిగింది. ఇక పెద్ద పెద్ద షాంపేన్ బాటిళ్లను ప్రజెంటేషన్ వేదికపై ఉంచడంతో భారత ఆటగాళ్లు చిన్నపిల్లల్లా సందడి చేశారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మపై సహచరులు షాంపేన్ పొంగించారు. గబ్బర్ శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్ షాంపేన్ బాటిళ్లను చేతిలో పట్టుకుని పొంగిస్తూ తెగ హాంగామా చేశారు.

ఇక రోహిత్ శర్మ వాళ్లను కాస్త వినండ్రా బాబు అన్నట్లు సైగ చేశాడు. ఇక అందరూ ఒక చోట చేరగా.. ధోనీ తరహాలోనే టీమిండియాలోని యంగ్ ప్లేయర్‌కు ట్రోఫీ అందజేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. అర్షదీప్‌కు ట్రోఫీ అందజేశారు. ఇక ట్రోఫీని అందుకున్నాక కేరింతలు కొడుతూ ఫొటోలకు పోజులిస్తూ తెగ అల్లరి చేశారు. ఇక రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ ప్రజెంటేషన్ అనంతరం చాలా సరదాగా ప్రవర్తించారు. కామెంట్రీ బాక్స్‌లో ఉండే మాజీ టీమిండియా కోచ్ రవిశాస్త్రికి వారు భలే గిఫ్ట్ ఇచ్చారు. ఇక తొలుత విరాట్.. రవి శాస్త్రికి షాంపేన్ ఆఫర్ చేయగా.. రిషబ్ పంత్ తీసుకెళ్లి దాన్ని రవిశాస్త్రికి అప్పగించి చీర్స్ చెప్పాడు. రవిశాస్త్రి సైతం దాన్ని అందుకుంటూ మురిసిపోయాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత ఇంగ్లాండ్ 259పరుగులు చేయగా.. ఇండియా 43.1ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీని హార్దిక్ అందుకోగా.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని రిషబ్ పంత్ అందుకున్నాడు.

Story first published: Monday, July 18, 2022, 11:30 [IST]
Other articles published on Jul 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+