టీమిండియాకు షాక్, బుమ్రా దూరం.. అతని స్థానంలో..? ముచ్చటగా మూడోసారి టాస్ గెలిచిన రోహిత్.. అందుకే బౌలింగ్

మాంచెస్టర్: ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా చివరి మ్యాచ్‌కు సన్నద్ధమైంది. లార్డ్స్‌లో జరిగిన రెండో వన్డేలో 100పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసిన టీమిండియా ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా జరిగే చివరిది మరియు నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తుంది. గత మ్యాచ్‌లోని లోటుపాట్లు సరిదిద్దుకుని సరైన రీతిలో ఇంగ్లాండ్‌కు బదులివ్వాలని రోహిత్ సేన భావిస్తుండగా.. టీ20 సిరీస్ కోల్పోయిన ఇంగ్లాండ్.. ఎలాగైన వన్డే సిరీస్ గెలిచి లెక్క సరి చేయాలని భావిస్తుంది. గత మ్యాచులో ఆ జట్టు బౌలర్లు తమ లయ అందుకోవడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. టోప్లీ, విల్లీ ఇద్దరూ నాణ్యమైన బౌలింగ్ వేస్తున్నారు. ఇక భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. బ్యాటింగ్ పరంగా జట్టు రాటుదేలాల్సిన అవసరముంది. ఇకపోతే గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు భారత స్టార్ బౌలర్ బుమ్రా దూరం కావడం టీమిండియాకు దెబ్బే అని చెప్పాలి.
గత మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకున్నాం
ఈ క్రమంలో టాస్ కోసం ఇరు జట్ల కెప్టెన్లు గ్రౌండ్లోకి వచ్చారు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'మేము ముందుగా బౌలింగ్ ఎంచుకుంటాం. ఇది మంచి ట్రాక్‌గా కనిపిస్తోంది. ఇది సిరీస్ డిసైడర్ మేము ఇంగ్లాండ్ పర్యటనలో కొంత మంచి క్రికెట్ ఆడాం. మేము గత మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకున్నాం. తప్పులను సరిదిద్దుకుంటామని ఆశిస్తున్నాం. తక్కువ టార్గెట్‌కే ఇంగ్లాండ్‌ను పరిమితం చేయగలమని ఆశిస్తున్నాం. బుమ్రాకు గాయమైంది. మేము అతనిని రిస్క్ చేయించొద్దనుకున్నాం. అందుకే అతని స్థానంలో సిరాజ్ టీంలోకి వచ్చాడు.' అని తెలిపాడు.
ప్రారంభంలో కొంత స్వింగ్ ఉన్నా..
టాస్ ఓడిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ.. మేము బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ప్రారంభంలో కొంత స్వింగ్ ఉండవచ్చు.. కానీ ఆట జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్‌కు పిచ్ మరింత మెరుగవుతుంది. ఈ సిరీస్ 1-1తో సమం కావడంతో ఈ మ్యాచ్ చేజార్చుకోవద్దనుకుంటున్నాం. చాలా పాజిటివ్‌లు మా పక్షాన ఉన్నాయి. చివరి గేమ్‌లో మేం మా టార్గెట్‌ను చక్కగా డిఫెండ్ చేసుకోగలిగాం. ఇక మా జట్టు తరఫున ఎలాంటి మార్పులు లేవు. సేమ్ టీంతో బరిలోకి దిగుతున్నాం.
తుది జట్లు :
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ
ఈ మైదానంలో చేదుగుర్తులు
మూడో వన్డేకు ఆతిథ్యమిస్తున్న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం భారత అభిమానులకు చేదు గుర్తులు మిగిల్చింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్లో ఓటమి తర్వాత మళ్లీ ఈ వేదికపై టీమిండియా వన్డే మ్యాచ్ ఆడుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన నాటి సెమీ ఫైనల్లో భారత్ అనూహ్యంగా పరాజయం పాలైన విషయం తెలిసిందే. ధోనీ రనౌట్ కావడం ఎంతో మంది అభిమానులను కన్నీటిపర్యంతం చేసింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు జరిగిన నాటి మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా పోరాడినా ఫలితం దక్కలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications