Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS ENG 3rd ODI: మహానుభావుడయ్యా.. మళ్లీ దెబ్బేసిన రోహిత్ - ఒక్క పరుగుకే తుస్సు

వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన టీమిండియా.. ఆఖరిదైన మూడో వన్డేలో ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు.. రెండో వన్డేలో సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడని ఆశించిన అభిమానులకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశ మిగిల్చాడు. అహ్మాదాబాద్ వేదికగా జరుగుతోన్న మూడో వన్డేలో అతడు దారుణంగా ఔట్ అయ్యాడు. కేవలం 2 బంతులు ఎదుర్కొన్న అతడు ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. మార్క్ వుడ్ బౌలింగ్ లో 1.1 ఓవర్ దగ్గర కీపర్ చేతికి చిక్కాడు. దీంతో ఆరు పరుగుల వద్ద తొలి వికెట్ ను కోల్పోయింది భారత్. ‌అప్పటి వరకు రోహిత్.. రోహిత్.. అంటూ అరిచి గోల చేసిన ప్రేక్షకులు.. హిట్ మ్యాన్ ఔట్ తో నిరాశలో పడిపోయారు.

చేజారిన భారీ రికార్డ్..
వాస్తవానికి ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ మరో 13 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్ గా నిలిచేవాడు. కానీ ఇప్పుడతడు 1 పరుగే చేయడం వల్ల భారీ రికార్డ్ చేజారిపోయింది.

IND VS ENG 3rd ODI Fan reaction on Rohit Sharma OUT for 1 run in 2 balls against england

నెటిజన్లు మిక్స్డ్ రియాక్షన్స్
రోహిత్ ఔట్ అవ్వడంతో క్రికెట్ అభిమానులు మళ్లీ ఎప్పటిలాగే కోహ్లీ వర్సెస్ రోహిత్ వార్ ను మొదలెట్టేశారు. కొంతమంది రోహిత్ కు మద్దతుగా నిలుస్తుండగా.. మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. రోహిత్ ఔట్ అవ్వడంతో కోహ్లీ బ్యాటింగ్ కు రావడాన్ని ఆనందిస్తూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ప్రతీ 15 నుంచి 20 ఇన్నింగ్స్ లో ప్రతీ క్రికెటర్ ఓ సెంచరీ బాదుతుంటాడు, అలానే రోహిత్ రెండో వన్డేలో అనుకోకుండా శతకం బాదేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

నిరాశతో సిరీస్ ముగించిన రోహిత్
మొత్తంగా ఈ సిరస్ ను నిరాశతో ముగించాడు రోహిత్ శర్మ. ఈ సిరీస్ లోని మూడు మ్యాచుల్లో కలిపి 40.67 సగటుతో 122 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లో 2 పరుగులు చేసి విఫలమయ్యాడు. కానీ రెండో వన్డేలో మాత్రం 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్ ల సాయంతో సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. 76 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేసి మొత్తంగా 119 పరుగులు చేశాడు. ఆదిల్ రషీద్ వేసిన 25.2 ఓవర్‌లో క్రీజు దాటి ముందుకు వచ్చి సిక్స్ బాది మరీ.. మూడంకెల స్కోరును సాధించాడు. కానీ మూడో వన్డేలో మళ్లీ విఫలమయ్యాడు.

Story first published: Wednesday, February 12, 2025, 14:43 [IST]
Other articles published on Feb 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+