Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng 3rd ODI: హార్దిక్ పాండ్యా అదరగొట్టినా.. చాహల్ సత్తా చాటినా.. ఇండియా ముందు టఫ్ టార్గెటే..!

Ind vs Eng 3rd ODI : Even Though Hardik strikes with 4, Chahal with 3 England Managed to Score 259

ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌‌ను హార్దిక్ పాండ్యా దెబ్బతీశాడు. (7-3-24-4) 7ఓవర్లలో 3మెయిడిన్లు వేసి 4వికెట్లు తీసి కేవలం 24పరుగులే ఇచ్చి చెలరేగాడు. హార్దిక్‌తో పాటు చాహల్ 3, సిరాజ్ 2, జడేజా 1వికెట్లతో రాణించడంతో 45.5ఓవర్లలో ఇంగ్లాండ్ 259పరుగులకు ఆలౌటైంది. ఇక ఆ జట్టు తరఫున కెప్టెన్ జాస్ బట్లర్ (60పరుగులు 80బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) బాధ్యతాయుత హాఫ్ సెంచరీతో రాణించాడు.

అదిరిపోయే షాకిచ్చిన సిరాజ్

ఇకపోతే ఇంగ్లాండ్‌కు ఆదిలోనే బౌలర్ మహమ్మద్ సిరాజ్ అదిరిపోయే షాకిచ్చాడు. రెండో ఓవర్లో తన తొలి స్పెల్ అందుకున్న సిరాజ్ జానీ బెయిర్ స్టో (0), జో రూట్ (0)లను డకౌట్ చేశాడు. బెయిర్ స్టో లీడింగ్ ఎడ్జ్ అయి క్యాచ్ ఔట్ కాగా, రూట్ స్లిప్ క్యాచ్ ఔటయ్యాడు. వీరిద్దరూ ఔటయినప్పటికీ అడపాదడపా ఫోర్లు కొడుతూ బెన్ స్టోక్స్, జాసన్ రాయ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇక తన తొలి స్పెల్ అందుకున్న హార్దిక్ పాండ్యా వీరిద్దరి పని పట్టాడు. పాండ్యా తన తొలి స్పెల్ 4ఓవర్లలో 3మెయిడెన్లు వేసి 2వికెట్లు పడగొట్టి 2పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలుత జాసన్ రాయ్ (41పరుగులు 31బంతుల్లో 7ఫోర్లు) కీపర్ క్యాచ్ ఔట్ కాగా.. బెన్ స్టోక్స్ (27పరుగులు 29బంతుల్లో 4ఫోర్లు) కాట్ అండ్ బౌల్ అవుట్ అయ్యాడు.

హార్దిక్ దెబ్బకు మిడిలార్డర్ ఢమాల్

ఇక 74పరుగులకే 4వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్‌ను జాస్ బట్లర్, మొయిన్ అలీ ఆదుకున్నారు. వీరిద్దరూ 5వ వికెట్‌కు 75పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రవీంద్రా జడేజా విడదీశాడు. మొయిన్ అలీ (34పరుగులు 44బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు)ను కీపర్ క్యాచ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన లివింగ్ స్టోన్ ఎప్పటిలాగే తన ఎటాకింగ్ గేమ్ ఆడాడు. అతను హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను టార్గెట్ చేసి హిట్టింగ్ చేయాలని చూశాడు. అనుకున్నట్లే రెండు సిక్సులు కొట్టగలిగాడు. కానీ మూడో సారి మాత్రం ఫైన్ లెగ్‌లో బౌండరీ వద్ద రవీంద్ర జడేజా పట్టిన క్యాచ్‌కు లివింగ్ స్టోన్ (27పరుగులు 31బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) ఔటయిపోయాడు. లివింగ్‌స్టోన్ ఇగోకు పాండ్యా సరైన బ్రేకులేశాడు. ఇక తర్వాత బట్లర్ (60) కూడా అదే రీతిలో జడేజా పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ బాట పట్టాడు.

చివర్లో చాహల్ మ్యాజిక్

ఇక ఆ జట్టు టెయిలండర్లు అయిన డేవిడ్ విల్లీ (18పరుగులు), క్రెయిగ్ ఓవర్టన్ (32పరుగులు 33బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) కాసేపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ అడపాదడపా ఫోర్లు బాదుతూ స్కోరుబోర్డును నడిపించారు. ఇక బౌలింగ్ అందుకున్న చాహల్ వీరిద్దరి అంతు చూశాడు. తొలుత విల్లీని ఔట్ చేసిన చాహల్, కాసేపటికే ఓవర్టన్‌ను కూడా క్యాచ్ ఔట్ చేశాడు. చివర్లో రీస్ టోప్లీని (0)బౌల్డ్ చేశాడు. దీంతో స్కోరు 259పరుగుల వద్ద ముగిసింది. ఇక ఈ పిచ్ మీద 260పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే ఆషామాషీ కాదు. భారత బ్యాటర్లు ఏం చేస్తారో మరీ.

తుది జట్లు :

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ

Story first published: Sunday, July 17, 2022, 19:58 [IST]
Other articles published on Jul 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+