Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొన్న విల్లీ చేతిలో.. ఈరోజు టోప్లీ చేతిలో సేమ్ టు ‘షేమ్’ ఔట్.. కోహ్లీ ఇక చూడలేమంటూ ఫ్యాన్స్ గగ్గోలు

Ind vs Eng 3rd ODI: Once Again Virat Kohli Out For Outside Off stump Delivery, Fans getting Emotional

ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఓల్డ్ ట్రాఫార్డ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌‌ 45.5ఓవర్లలో ఇంగ్లాండ్ 259పరుగులకు ఆలౌటైంది. ఇక 260పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు రీస్ టోప్లీ లాంటి ప్రమాదకర బౌలర్ వల్ల మరోసారి దెబ్బ పడింది. అతను తన తొలి స్పెల్‌లో శిఖర్ ధావన్ (1), రోహిత్ శర్మ (17పరుగులు 17బంతుల్లో 4ఫోర్లు), విరాట్ కోహ్లీ (17పరుగులు 22పరుగులు 3ఫోర్లు)లను ఔట్ చేశాడు. 10ఓవర్లు ముగియకుండానే ఈ ముగ్గురు పెవిలియన్ బాట పట్టారు. ఈ ముగ్గురిని టోప్లీ బురిడీ కొట్టించాడు. దీంతో ఇండియా 38పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.

మిగతాదంతా సేమ్ టు సేమ్

ఇక ఈ మ్యాచ్ ద్వారా అయిన ఫామ్ పుంజుకుంటాడేమో అని ఎదురుచూసిన కోహ్లీ అభిమానులకు భారీ నిరాశే ఎదురైంది. 2వ వన్డేలో ఎలాగైతే ఔటయ్యాడో సేమ్ టు సేమ్ అదేవిధంగా ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్ అవతల పడ్డ బంతిని ఆడే క్రమంలో బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయి నేరుగా కీపర్ బట్లర్ చేతిలోకి వెళ్లింది. అయితే మొన్న డేవిడ్ విల్లీ చేతిలో కోహ్లీ ఈ రీతిలో ఔట్ కాగా.. ఈసారి రీస్ టోప్లీ చేతిలో ఔటయ్యాడు. ఇక కోహ్లీ మొన్న రెండో వన్డేలో మూడు ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చినట్టు కన్పించాడు. ఈరోజు కూడా అదే తరహాలో మూడు ఫోర్లు కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు. మొన్న 16 పరుగులు చేశాడు. ఈరోజు ఇంచుమించు ఒక్క పరుగు ఎక్కువగా 17పరుగులు చేశాడు. మొన్న 25బంతులు ఆడగలిగాడు.. ఈరోజు అందుకు దగ్గరగా 22బంతులు ఆడాడు.

కోహ్లీ ఔటవుతున్న తీరే కలిచివేస్తుంది.

ఇక కోహ్లీ ఔటవుతున్న విధానాన్ని ఫ్యాన్స్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లీ ప్లీజ్ ఇంకా మేము నిన్నిలా చూడలేమంటూ ట్విట్టర్లో గగ్గోలు పెడుతున్నారు. బాల్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడుతున్నా.. వైడ్ ఆఫ్ స్టంప్ పడుతున్నా కోహ్లీ ఎదుర్కోబోయి కీపర్ లేదా స్లిప్‌లో ఫీల్డర్ చేతికి చిక్కుతున్నాడు. అతని మైనస్ పాయింట్ పూర్తిగా బౌలర్లు పసిగట్టారు. ఇకపోతే గత మూడేళ్లుగా సెంచరీ చేయని కోహ్లీ ఇటీవల అత్యంత దారుణ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో చేదు ఐపీఎల్ సీజన్‌ను చవిచూశాడు. కెప్టెన్సీ వదులుకున్నా అతను బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా విఫలమవుతూనే ఉన్నాడు. ఇక తాజా ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ పేలవంగా ఆడుతున్నాడు. అతను ఈ పర్యటనలో పూర్తిగా విఫలమయ్యాడు. టెస్ట్, టీ20, వన్డే మూడు ఫార్మాట్లలో అతను వసరుగా 11, 20, 1, 11, 16, 17 పరుగులు మాత్రమే చేశాడు.

కోహ్లీ అభిమానుల బాధ వర్ణనాతీతం

ఇక ట్విట్టర్లో కోహ్లీ అభిమానులు తమ నిరాశను వెల్లగక్కుతున్నారు. అభిమానుల బాధ పోస్టుల రూపంలో చూస్తుంటే వర్ణనాతీతంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాము కుట్టిన తర్వాత కోలుకోవడానికి ఎంత వేదన పడుతుంటాడో ప్రస్తుతం కోహ్లీ కూడా అదే సీన్‌లో ఉన్నట్లు ఓ నెటిజన్ సీన్ క్రియేట్ చేశాడు. మరో నెటిజన్ కోహ్లీ ఔటవుతున్న తీరు పట్ల చింతిస్తూ ఏడుపు లంకించుకునే మీమ్ పోస్ట్ చేశాడు. ఇక కోహ్లీ గురించి పోస్టులు కుప్పలు తెప్పలుగా హ్యాష్ ట్యాగ్ ద్వారా పోస్ట్ అవుతూనే ఉన్నాయి.

Story first published: Sunday, July 17, 2022, 20:58 [IST]
Other articles published on Jul 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+