India vs England 2nd Test: ఔట్ అయిన అసహనంలో విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా?

లండన్: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ శామ్ కరన్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరిన బంతిని వెంటాడిన కోహ్లీ (20: 31 బంతుల్లో 4x4).. వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అంతకముందే పేసర్ జేమ్స్ అండర్సన్, కోహ్లీ మధ్య మాటల యుద్ధం నడిచింది. దీంతో కోహ్లీ పట్టుదలతో కనిపించాడు. బౌండరీలు బాది మంచి ఊపుమీదున్నాడు. అయితే ఎప్పటిలానే ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్లే బంతుల్ని వెంటాడే బలహీనతతో వికెట్ చేజార్చుకున్నాడు.
టవల్‌ను అద్దానికి విసిరికొట్టాడు
విరాట్ కోహ్లీ వికెట్ దక్కడంతో శామ్ కరన్ మైదానంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాడు. గాల్లోకి ఎగురుతూ తనడైన శైలిలో పంచ్‌లు విసిరాడు. మరోవైపు జేమ్స్ అండర్సన్ కూడా కోహ్లీ వికెట్ పడడంతో ఆనందపడ్డాడు. కీలక సమయంలో కోహ్లీ ఔట్ అవ్వడంతో ఇంగ్లీష్ ప్లేయర్స్ ఆనందంలో మునిగిపోయారు. తీవ్ర నిరాశలో పెవిలియన్‌కి వెళ్లిన కోహ్లీ.. తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయాడు. డ్రెస్సింగ్ రూములో కోహ్లీ తన టవల్‌తో చెమటలు తుడుచుకుని.. అదే టవల్‌ను అద్దానికి విసిరికొట్టాడు. ఈ ఘటన అక్కడి కెమెరాలో రికార్డు అయింది. అది కాస్త నెట్టింట వైరల్ అయింది.

ఇదేమీ నీ ఇల్లు కాదు
మూడో రోజు జేమ్స్ అండర్సన్, జస్ప్రీత్ బుమ్రా మధ్య ఘర్షణ చోటు చేసుకుంటే.. ఆదివారం విరాట్ కోహ్లీ, అండర్సన్ మధ్య అగ్గి రాజుకుంది. ఇద్దరు ఆటగాళ్లు పరస్పరం దూషించుకున్నారు. 'బుమ్రాను తిట్టినట్లే నువ్వు నన్నూ తిడుతున్నావా?. ఇదేమీ నీ ఇల్లు కాదు' అని కోహ్లీ కోపంగా అండర్సన్‌ను చూస్తూ అనడం స్టంప్ మైక్రోఫోన్లో వినిపించింది. అండర్సన్ ఏదో అన్నాడు కానీ.. అది మాత్రం స్పష్టంగా వినిపించలేదు.
ఆపై టీమిండియా కెప్టెన్ స్పందిస్తూ.. 'వయసు పెరగడం వల్లే నువ్విలా ప్రవరిస్తున్నావు' అన్నాడు. నాలుగో రోజు 17వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. అండర్సన్ అదేపనిగా పిచ్‌పై పరుగెడుతున్నాని అంపైర్‌తో కోహ్లీ చెప్పడంతో ఈ మాటల యుద్ధం మొదలైంది. ఆ తర్వాత అది తీవ్రమైంది.

ఏడాదిన్నర కాలంగా
వాస్తవానికి విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా సెంచరీ బాదాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్లోనూ విఫలమయ్యాడు.
ఇంగ్లండ్‌తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్‌లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ వస్తున్నాడు. 2008లో క్రికెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఏడాది శతకం సాధిస్తూ వచ్చిన కోహ్లీ.. 2020లో మాత్రమే మూడెంకల స్కోరు అందుకోలేకపోయాడు.

పంత్ ఏం చేస్తాడో
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చివరి అంకానికి చేరుకుంది. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీసేన.. వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి181 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 154 పరుగులుగా ఉంది. క్రీజులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (14 బ్యాటింగ్: 29 బంతుల్లో), సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్: 10 బంతుల్లో) ఉన్నారు. పంత్ ఆటలో చివరి రోజైన సోమవారం ఉదయం తొలి సెషన్‌లో స్కోరు చేయడంపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IND vs ENG Day 5 Weather Report:ఇంగ్లండ్ మాదిరిగానే..వరణుడు భారత్‌ను సేవ్ చేస్తాడా?కాస్త కనిరించవయ్యా!