Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

33 పరుగులు: అరుదైన రికార్డుని చేజార్చుకున్న కోహ్లీ

విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుని చేజార్చుకున్నాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు చేసిన కోహ్లీ ఇంగ్లాండ్ బౌలర్ అలీ బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.

317/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 100.3 ఓవర్ల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. అలీ బౌలింగ్‌లో కోహ్లీ 167 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో టెస్టులో విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

అలా కాకుండా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి ఉంటే తన క్రికెట్ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకునేవాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత ఆటగాడిగా నిలిచేవాడు. అయితే ఈ అవకాశాన్ని కోహ్లీ 33 పరుగుల తేడాతో జేజార్చుకున్నాడు.

Ind vs Eng, 2nd Test: Virat Kohli misses rare record on day 2

ఈ ఏడాది ప్రధమార్ధంలో వెస్టిండిస్‌తో ఆ దేశంలో జరిగిన టెస్టు సిరిస్‌లో కోహ్లీ డబుల్ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత ఇటీవలే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

గతంలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో భారత తరపున వినోద్ మన్కడ్, వినోద్ కాంబ్లి, రాహుల్ ద్రవిడ్ రెండు డబుల్ సెంచరీలు సాధించారు. 1955లో వినోద్ మన్కడ్, 1992లో వినోద్ కాంబ్లి, 2003లో ద్రవిడ్ ఆ ఘనతను సాధించారు. వీరి తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడు కోహ్లీ ఒక్కడే.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+