Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG 2nd Test: రెండో టెస్టులో ఈ బౌలర్‌ను తప్పక ఆడించాలి: మైఖేల్ క్లార్క్

IND vs ENG 2nd Test: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరగనుంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉండగా.. భారత జట్టు బౌలింగ్ నిరాశాజనకంగా ఉంది. రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా ఆడే విషయంపై సందేహాలు నెలకొనడంతో ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ బుమ్రా పేరు చెప్పకుండా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరును ప్రస్తావించారు. రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని.. అందుకు గల కారణానని కూడా ఆయన వివరించారు.

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్టుకు సంబంధించి మైఖేల్ క్లార్క్ "బియాండ్ 23" పాడ్‌కాస్ట్‌లో టీమిండియా ప్లేయింగ్ 11లో కుల్దీప్ యాదవ్‌ను చేర్చాలని సూచించారు. ఇంగ్లాండ్‌లో 20 వికెట్లు తీస్తేనే గెలవగలరని ఆయన అన్నారు. తన అభిప్రాయం ప్రకారం కుల్దీప్ యాదవ్ వికెట్ టేకింగ్ బౌలర్ అని.. అతను ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే శుభ్‌మన్ గిల్ టీమ్‌కు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

IND vs ENG 2nd Test Michael Clarke Recommends Kuldeep Yadav in Playing 11

ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం పిచ్ టర్న్ అవుతుంది..

మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ, "ఏ ఒక్క బౌలర్‌నూ నిందించను, కానీ టీమిండియా తప్పనిసరిగా కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలి. అతను తెలివైన వికెట్ తీసే బౌలర్, అతను లేకపోవడం వల్ల రెండో టెస్టులో అంత తేడా కనిపించింది.ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం పిచ్ కొద్దిగా టర్న్ అవుతుంది, కాబట్టి కుల్దీప్ యాదవ్ ప్రమాదకరంగా మారగలడు. కుల్దీప్ ఫామ్‌లో ఉంటే ఇండియాకు గెలవడం సులభం అవుతుంది. ప్లేయింగ్ 11లో అతను ఉండటం నిర్ణయాత్మకంగా మారవచ్చు." అని క్లార్క్ అన్నారు.

ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మెన్ నిక్ నైట్ కూడా శుభమన్ గిల్ రెండో టెస్టు ప్లేయింగ్ 11లో కుల్దీప్ యాదవ్‌ను చేర్చాలని భావిస్తున్నారు. అదే పాడ్‌కాస్ట్‌లో, ఇంగ్లాండ్ దూకుడు వైఖరిని అవలంబిస్తుందని, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వైవిధ్యంతో వారికి కష్టాలు ఎదురవుతాయని ఆయన అన్నారు.

ఏ బౌలర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ 11లోకి రావచ్చు?
జస్ప్రీత్ బుమ్రా ఆడే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే అతను రెండో టెస్ట్ ఆడకపోతే కుల్దీప్ యాదవ్ బుమ్రా స్థానంలో ప్లేయింగ్ 11లో చేరే అవకాశం ఉంది. కానీ బుమ్రా ఆడితే.. శార్దూల్ ఠాకూర్‌ను తప్పించే అవకాశం ఉంది. కుల్దీప్ గతంలో 2018లో ఇంగ్లాండ్‌లో ఒకే టెస్ట్ ఆడాడు. అందులో 9 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.

రెండో టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ 11(అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.

Story first published: Sunday, June 29, 2025, 16:03 [IST]
Other articles published on Jun 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+