For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG 2nd Test:'బుమ్రా మామూలోడు కాదు.. అతడి అమ్ములపొదిలో ఎన్నో అస్త్రాలు ఉన్నాయి'

IND vs Eng 2nd Test: Jonny Bairstow says Jasprit Bumrah Is A World Class Bowler

లండన్‌: టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రాపై ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్‌ జానీ బెయిర్‌స్టో ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా అమ్ముల పొదిలో అన్ని అస్త్రాలు ఉన్నాయని కొనియాడాడు. గత జూన్‌లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డ‌బ్ల్యూటీసీ)లో న్యూజిలాండ్‌పై ఒక్క వికెట్‌ తీయకపోయినా.. తాజాగా ఇంగ్లండ్‌తో ఆడిన తొలి టెస్టులో మొత్తం 9 వికెట్లు తీసి మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ నడ్డివిరిశాడు. ఈ క్రమంలోనే బుమ్రా బౌలింగ్‌పై స్పందించిన బెయిర్‌స్టో ఫార్మాట్లకు అతీతంగా అన్ని నైపుణ్యాలు కలిగి ఉన్నాడని ఆకాశానికెత్తేశాడు.

బుమ్రా గురించి అన్నీ చెప్పలేను:

బుమ్రా గురించి అన్నీ చెప్పలేను:

లార్డ్స్ వేదికగా గురువారం నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో జానీ బెయిర్‌స్టో మాట్లాడుతూ... 'జస్ప్రీత్ బుమ్రా గురించి ఇప్పుడు అన్నీ చెప్పలేను. ఫార్మాట్లకు అతీతంగా అతడి వద్ద చాలా నైపుణ్యాలు ఉన్నాయి. బరిలోకి దిగాక ఎలాంటి బంతులేయాలో.. ఎక్కడ వేయాలో తనకు బాగా తెలుసు. ఈ క్రమంలోనే తన బౌలింగ్‌ యాక్షన్‌తో వైవిధ్యం కూడా ప్రదర్శిస్తాడు. బుమ్రా ఆడింది 21 టెస్టులే అయినా అమితమైన ప్రభావం చూపాడు. అతడో ప్రపంచ శ్రేణి బౌలర్‌ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే.. అటు ఐపీఎల్‌లో ఇటు భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ రాణిస్తున్నాడు' అని అన్నాడు.

పిచ్‌లను బట్టి బ్యాటింగ్‌ చేస్తా:

పిచ్‌లను బట్టి బ్యాటింగ్‌ చేస్తా:

తాను భారత బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనే విషయంపై స్పందించిన జానీ బెయిర్‌స్టో.. పిచ్‌లను బట్టి బ్యాటింగ్‌ చేస్తానన్నాడు. తాను ఎలా ఆడతాననేది చెప్పడం కష్టమని చెప్పాడు. 'నేను ఎలా బ్యాటింగ్‌ చేస్తాననేది చెప్పడం కష్టం. గత మ్యాచ్‌తో పోలిస్తే నా ఆటలో పెద్దగా మార్పులేమీ ఉండవు. అయితే ఇటీవల నేను టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడలేదు. ఒకవేళ నేను గ్యాప్‌ లేకుండా ఆడి తొలి టెస్టులో ఎలా ఆడానో చూస్తే.. అప్పుడా విధంగా ముందుకు వెళ్లాలనుకుంటాను. అయితే టీమిండియాతో ఎక్కడ ఆడినా పరిస్థితులకు తగ్గట్టు ఆడాలి. ఇంతకుముందు భారత్‌లో ఆడినప్పుడు వేర్వేరు రకమైన పిచ్‌లు ఉంటాయి. అహ్మదాబాద్‌, చెన్నై పిచ్‌లు ఎలా ఉన్నాయో ఉదాహరణగా చెప్పొచ్చు. కాబట్టి ఎక్కడ ఎలా ఆడాలనేది కచ్చితంగా చెప్పలేం. టెస్టు క్రికెట్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడటమే ఉత్తమం. అదే కీలకం కూడా' అని జానీ చెప్పుకొచ్చాడు.

రెండు మార్పులతో ఇంగ్లండ్:

రెండు మార్పులతో ఇంగ్లండ్:

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం (ఆగస్టు 12) నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌‌కు ఇంగ్లండ్‌, భారత్ జట్లు సమయాత్తం అవుతున్నాయి. తొలి టెస్ట్‌లో వర్షం కారణంగా ఓటమిని తృటిలో తప్పించుకున్న రూట్ సేన తమ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడింది. తొలి టెస్ట్‌లో జాక్‌ క్రాలీ కూడా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 27 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు గత 7 టెస్టులో అతడి యావరేజ్ 11 మాత్రమే ఉంది. దీంతో క్రాలీపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్రాలీ స్థానంలో హసీబ్ హమీద్ జట్టులోకి రానున్నాడు. డేనియల్ లారెన్స్ కూడా మోస్తరు ప్రదర్శనకే పరిమితమయ్యాడు. 0, 25 రన్స్ చేసిన అతడి స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ రానున్నాడు. అలీకి ఈసీబీ నుంచి కాల్ రావడంతో 'ది హండ్రెడ్' టోర్నీ నుంచి నేరుగా వచ్చేశాడు. గత 23 నెలల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడనప్పటికీ.. అలీ వైట్-బాల్ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ఇంగ్లండ్‌ తుది జట్టు:

ఇంగ్లండ్‌ తుది జట్టు:

రోరి బర్న్స్‌, డామ్‌ సిబ్లే, జాక్‌ క్రాలీ/హసీబ్ హమీద్, జో రూట్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, డేనియల్ లారెన్స్/మొయిన్ అలీ, జొస్ బట్లర్‌, సామ్‌ కరన్‌, ఓలీ రాబిన్‌సన్‌, స్టువర్ట్ బ్రాడ్‌, జేమ్స్ ఆండర్సన్‌.

Story first published: Tuesday, August 10, 2021, 22:00 [IST]
Other articles published on Aug 10, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+