ND Vs ENG 2nd Test: జో రూట్ సెంచరీ.. కెప్టెన్‌గా అరుదైన రికార్డు!!

లండన్: ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ భారత్‌పై మరో సెంచరీ బాదాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో (109) పరుగులు చేసిన రూట్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ మూడంకెల స్కోరు అందుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన 82వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసిన ఇంగ్లండ్ కెప్టెన్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం చేశాడు. టెస్టుల్లో రూట్‌కు ఇది 22వ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు భారత పర్యటనలోనూ రూట్ తొలి టెస్టులో ద్విశతకం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లండ్ 82 ఓవర్లకు 243/4తో కొనసాగుతోంది. రూట్‌కు అండగా జోస్ బట్లర్ (3) పరుగులతో క్రీజులో ఉన్నాడు.

కెప్టెన్‌గా అరుదైన రికార్డు:
రెండో టెస్టులో జో రూట్ సెంచరీ బాదడంతో కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక కేలండర్ ఇయర్‌లో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్‌గా రూట్ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూట్ 5 సెంచరీలు బాదాడు. ఈ జాబితాలో గ్రాహం గూచ్ (1990), మైఖేల్ అర్ధర్‌టన్ (1994), ఆండ్రూ స్ట్రాస్ (2009) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరందరూ ఒక కేలండర్ ఇయర్‌లో నాలుగేసి సెంచరీలు బాదారు. ఈ ఏడాది టీమిండియాపైనే రూట్ మూడు శతకాలు బాదడం విశేషం.

అత్యధిక టెస్టు సెంచరీలు:
ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా కూడా జో రూట్ మరో రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసింది మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్. కుక్ 33 శతకాలు బాదాడు. మాజీసారథి కెవిన్ పీటర్సన్ 23 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఐదుగురు బ్యాట్స్‌మన్‌లు ఉన్నారు. వాలీ హమ్మండ్, కోలిన్ కౌడ్రీ, జెఫ్రీ బాయ్‌కాట్, ఇయాన్ బెల్ ఇప్పటివరకు ఉండగా.. తాజాగా ఈ జాబితాలో జో రూట్ చేరాడు. వీరందరూ ఇంగ్లండ్ తరఫున 22 టెస్ట్ సెంచరీలు బాదారు.

రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా:
ఇక టెస్టు క్రికెట్‌లో బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా జో రూట్ నిలిచాడు. ఇప్పటి వరకూ మాజీ ఆటగాడు ఇయాన్ బెల్ మాత్రమే ఈ రికార్డ్‌లో ఉండగా.. అతను 2013 యాషెస్ టెస్టు సిరీస్‌లో ఈ ఘనత సాధించాడు. నాటింగ్‌హామ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్ 109 పరుగులు చేసిన విషయం తెలిసిందే. టెస్టు కెరీర్‌లో జో రూట్‌కి ఇది 22వ టెస్టు శతకం కాగా.. ఇంగ్లీష్ కెప్టెన్‌గా ఇది 11వ టెస్టు సెంచరీ కావడం విశేషం.

బౌన్సర్లతో పరీక్షిస్తున్నా:
భారత బౌలర్లని ఎంతో సహనంతో ఎదుర్కొంటున్న జో రూట్.. గతి తప్పిన బంతుల్ని మాత్రమే తెలివిగా బౌండరీకి తరలిస్తున్నాడు. టీమిండియా బౌలర్లు అతడ్ని షార్ట్ పిచ్, బౌన్సర్లతో పరీక్షిస్తున్నా.. వాటిని ఓర్పుతో వదిలేస్తున్నాడు. బంతి ఏమాత్రం లెగ్ సైడ్ పడినా ప్లిక్‌తో ఫోర్‌గా మలుస్తున్నాడు. ఈ క్రమంలో జానీ బెయిర్‌స్టో కలిసి నాలుగో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రూట్.. కెరీర్‌లోనూ అరుదైన మైలురాళ్లని అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications