Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: అండర్సన్ అరుదైన ఘనత.. 70 ఏళ్లలో ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకి!!

IND vs ENG 2nd Test: James Anderson is a oldest pacer to take 5-wicket haul in last 70 years

లండన్: ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్, స్వింగ్ కింగ్ జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీమిండియాతో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. దాంతో గత 70 ఏళ్లలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. లార్డ్స్ టెస్టు తొలి రోజు రోహిత్‌ శర్మ, చతేశ్వర్ పుజారాను ఔట్ చేసిన అండర్సన్.. రెండో రోజు అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అండర్సన్ వయసు 39 ఏళ్లు. ఈ వయసులో కూడా తనలో ఏమాత్రం పదును తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. బుల్లెట్ బంతులతో బ్యాట్స్‌మన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు.

టెస్టు క్రికెట్‌లో అతి పెద్ద వయసులో ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు సాధించిన రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ జెఫ్ చబ్ పేరిట ఉంది. 1951లో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన టెస్టులో చబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. అప్పటికి అతడి వయసు 40 ఏళ్ల 86 రోజులు. 70 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జేమ్స్ అండర్సన్ 39 ఏళ్ల 14 రోజుల వయసులో ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం అండర్సన్‌కు ఇది 31వ సారి. ప్రస్తుత ఆటగాళ్లలో ఆర్ అశ్విన్ (30), స్టువర్ట్ బ్రాడ్ (18), షకిబుల్ హాసన్ (18), నాథన్ లియోన్ (18) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

జేమ్స్ అండర్సన్‌కు లార్డ్స్‌ మైదానంలో భారత్‌పై మంచి రికార్డే ఉంది. 2007 నుంచి చూసుకుంటే భారత్‌పై లార్డ్స్‌ టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అండర్సన్‌.. మరో రెండుసార్లు నాలుగు వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా లార్డ్స్‌ మైదానంలో టీమిండియాపై అండర్సన్‌ టెస్టుల్లో ఇప్పటివరకు 33 వికెట్లు తీశాడు. తొలి టెస్టు మూడో రోజు కేఎల్ రాహుల్‌ను అవుట్ చేసిన అండర్సన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా స్పిన్ దిగ్గజ అనిల్ కుంబ్లేను అధిగమించాడు. మొత్తంగా అండర్సన్‌ 164 టెస్టుల్లో 626 వికెట్లు తీశాడు.

ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ టీమిండియాపై టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో 50 వికెట్లు తీసిన ఆరో స్పిన్నర్‌గా అలీ నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో మొహ్మద్ షమీ వికెట్‌ తీయడం ద్వారా అలీ ఈ ఘనతను అందుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో ముత్తయ్య మురళీధరన్‌ (శ్రీలంక) 105 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు. నాథన్‌ లియాన్‌ (ఆస్ట్రేలియా) 94 వికెట్లతో రెండో స్థానంలో, 63 వికెట్లతో లాన్స్‌ గిబ్స్‌ (వెస్టిండీస్‌) మూడో స్థానంలో, అండర్‌ వుడ్‌ (ఇంగ్లండ్‌) 62 వికెట్లతో నాలుగులో స్థానంలో, 52 వికెట్లతో బెనాడ్‌ (ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో ఉన్నారు.

Story first published: Friday, August 13, 2021, 23:11 [IST]
Other articles published on Aug 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+