Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG 2nd Test: మొయిన్ అలీ ఆగయా.. రెండు మార్పులతో బరిలోకి ఇంగ్లండ్! తుది జట్టు ఇదే!!

IND vs Eng 2nd Test: England Predicted Playing 11 And Can Joe Root Continue His Domination

హైదరాబాద్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం (ఆగస్టు 12) నుంచి లార్డ్స్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌‌కు ఇంగ్లండ్‌, భారత్ జట్లు సమయాత్తం అవుతున్నాయి. ఇరు జట్లు ముమ్ముర సాధన చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ ప్లేయర్స్. తొలి టెస్ట్‌లో వర్షం కారణంగా ఓటమిని తృటిలో తప్పించుకున్న రూట్ సేన తమ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడింది. సొంతగడ్డపై లభించే అడ్వాంటేజ్‌తో కోహ్లీసేను ఓడించాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రెండో టెస్టుకు ఓ రెండు మార్పులతో ఇంగ్లండ్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మాటలను బట్టి అర్ధమవుతోంది.

క్రాలీ స్థానంలో హసీబ్ హమీద్:

క్రాలీ స్థానంలో హసీబ్ హమీద్:

తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు రోరి బర్న్స్‌, డామ్‌ సిబ్లేలు పూర్తిగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలో సరైన ఆరంభాలు ఇవ్వలేదు. బర్న్స్‌ 0, 18 పరుగులు చేస్తే.. సిబ్లే 18, 28 రన్స్ చేశాడు. అయితే ఈ ఇద్దరికి మరో అవకాశం లభించనుంది. ఇక జాక్‌ క్రాలీ కూడా నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 27 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు గత 7 టెస్టులో అతడి యావరేజ్ 11 మాత్రమే ఉంది. దీంతో క్రాలీపై వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్రాలీ స్థానంలో హసీబ్ హమీద్ జట్టులోకి రానున్నాడు. హమ్మద్ చివరిసారిగా నవంబర్ 2016లో ఆడాడు. గాయం కారణంగా అప్పటినుంచి ఆడలేదు. హమీద్ ఆడడానికి సిద్ధంగా ఉన్నాడని, మేము అతనికి అవకాశం ఇవ్వాలని ఇంగ్లండ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ అన్నాడు.

అలీ ఆగయా:

నాలుగు, ఇదో స్థానాల్లో జో రూట్‌, జానీ బెయిర్‌స్టో రానున్నారు. రూట్ సెంచరీ బాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోసారి అతడు అదే ప్రదర్శన చేయాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బెయిర్‌స్టో మాత్రం భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. డేనియల్ లారెన్స్ మోస్తరు ప్రదర్శనకే పరిమితమయ్యాడు. 0, 25 రన్స్ చేసిన అతడి స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్‌ మొయిన్ అలీ రానున్నాడు. అలీకి ఈసీబీ నుంచి కాల్ రావడంతో 'ది హండ్రెడ్' టోర్నీ నుంచి నేరుగా వచ్చేశాడు. గత 23 నెలల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడనప్పటికీ.. అలీ వైట్-బాల్ క్రికెట్‌లో ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్, 'ది హండ్రెడ్' టోర్నీల్లో అలీ సత్తాచాటాడు. జొస్ బట్లర్‌ ఫామ్ అందుకోవాల్సి ఉంది.

బ్రాడ్‌ కూడా రాణిస్తే:

బ్రాడ్‌ కూడా రాణిస్తే:

పేసర్లుగా సామ్‌ కరన్‌, ఓలీ రాబిన్‌సన్‌, స్టువర్ట్ బ్రాడ్‌, జేమ్స్ ఆండర్సన్‌లకు అవకాశం దక్కనుంది. బ్రాడ్‌ మినహా మిగతా ముగ్గరు తొలి టెస్టులో సత్తాచాటారు. రాబిన్‌సన్‌ అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. బ్రాడ్‌ కూడా రాణిస్తే.. రూట్ సేనకు తిరుగుండదు. తొలి టెస్టులో స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగిన విషయం తెలిసిందే. మొయిన్ అలీ జట్టులోకి రావడంతో ఒక స్పిన్నర్ జట్టులో ఉంటాడు. పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ సొంత గడ్డపై సత్తాచాటాలని చూస్తోంది. భారత్ కూడా నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌ (4+1) ఫార్మూలానే ఫాలో అవనుంది. వరుసగా విఫలమవుతున్న పుజారాను పక్కన పెడతారా? లేక మరో అవకాశం ఇస్తారో? చూడాలి. ఒక వేళ పక్కపెడితే మాత్రం మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

ఇంగ్లండ్‌ తుది జట్టు:

ఇంగ్లండ్‌ తుది జట్టు:

రోరి బర్న్స్‌, డామ్‌ సిబ్లే, జాక్‌ క్రాలీ/హసీబ్ హమీద్, జో రూట్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, డేనియల్ లారెన్స్/మొయిన్ అలీ, జొస్ బట్లర్‌, సామ్‌ కరన్‌, ఓలీ రాబిన్‌సన్‌, స్టువర్ట్ బ్రాడ్‌, జేమ్స్ ఆండర్సన్‌.

Story first published: Tuesday, August 10, 2021, 19:12 [IST]
Other articles published on Aug 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+