For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG Day 5 Weather Report:ఇంగ్లండ్‌ మాదిరిగానే..వరణుడు భారత్‌ను సేవ్ చేస్తాడా?కాస్త కనిరించవయ్యా!

IND vs ENG 2nd Test Day 5 Weather Report: Will Rain Save India Today?

లండన్: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చివరి అంకానికి చేరుకుంది. మ్యాచ్‌లో నాలుగో రోజైన ఆదివారం 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీసేన.. వెలుతురు లేమి కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి181 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 154 పరుగులుగా ఉంది. క్రీజులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (14 బ్యాటింగ్: 29 బంతుల్లో), సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (4 బ్యాటింగ్: 10 బంతుల్లో) ఉన్నారు. పంత్ ఆటలో చివరి రోజైన సోమవారం ఉదయం తొలి సెషన్‌లో స్కోరు చేయడంపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.

 ఆకాశం మేఘావృతం ఉండనుంది:

ఆకాశం మేఘావృతం ఉండనుంది:

లండన్ వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. మ్యాచ్ జరిగే లార్డ్స్ మైదానంలో సోమవారం వర్షం పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. భారీ వర్షం పడుకున్నా.. మోస్తరుగా పడే అవకాశాలు ఉన్నాయి. సోమవారం ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని, అపుడప్పుడు చిరు జల్లులు కురుస్తాయని తెలుస్తోంది. కొంతవరకు లార్డ్స్ మైదానాన్ని మబ్బులు కమ్మేస్తాయని, చల్లని గాలులు కూడా వీస్తాయట. కనిష్టంగా 17 డిగ్రీలు, గరిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతాయని పేర్కొంది. మొత్తానికి చివరి రోజు ఆటకు వరణుడు ఆటంకం కలిగించనున్నాడు. మ్యాచ్ ఓ సెషన్ పాటు తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది.

 వర్షం వస్తుందా? లేదో?:

వర్షం వస్తుందా? లేదో?:

అయితే ఇంగ్లండ్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణం బిన్నంగా ఉంటోంది. వాతావరణ శాఖ చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. వాతావరణ శాఖ వర్షం వస్తుందని చెపితే.. రావడం లేదు. రావడం లేదంటే వస్తుంది. ఫస్ట్ టెస్ట్ చివరి రోజు, సెకండ్ టెస్ట్ తొలి రోజు వర్ష సూచన లేదని పేర్కొనగా.. తీర సమయానికి వరణుడు ఆటకు అంతరాయం కలిగించాడు. రెండో రోజు కూడా వాతావరణ శాఖ చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. మూడో రోజు మాత్రం వర్షం సూచనలేదని, ఎండ కాస్తుందని చెప్పింది. ఇది మాత్రం జరిగింది. ఇక నాలుగో రోజు బ్యాడ్ లైట్ ఆటను మింగేసింది. మరీ లండన్ వాతావరణ శాఖ చెప్పినట్లు ఐదవ రోజు వర్షం వస్తుందా? లేదో? చూడాలి.

భారత్‌ను కాపాడాలని:

భారత్‌ను కాపాడాలని:

లండన్ వాతావరణ శాఖ చెప్పినట్టు ఐదవ రోజు వర్షం పడాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే.. క్రీజులో ఉంది బ్యాట్స్‌మన్‌ రిషబ్ పంత్ ఒక్కడే. మిగిలిన వారందరూ బౌలర్లే. ఇషాంత్ శర్మ, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు పెద్దగా ఆడిన దాఖలు లేవు. ఇషాంత్, షమీ మాత్రమే కాస్తోకూస్తో బ్యాటింగ్ చేయగల సమర్థులు. అయితే ఉదయం బంతి స్వింగ్ అవ్వనున్న నేపథ్యంలో వీరు ఏ మేరకు క్రీజులో నిలబడతారో చూడాలి. ఒకవేల పంత్ త్వరగా ఔట్ అయితే.. మిగతావారిని పెవిలియన్ చేర్చడం ఇంగ్లండ్ బౌలర్లకు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అందుకే తొలి టెస్టులో ఇంగ్లండ్‌ జట్టును సేవ్ చేసినట్టు.. వరణుడు భారత్‌ను కాపాడాలని కోరుకుంటున్నారు.

రాహుల్, రూట్ శతకాలు:

రాహుల్, రూట్ శతకాలు:

గురువారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకి ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (129: 250 బంతుల్లో 12x4, 1x6) టాప్ స్కోరర్‌ కాగా.. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (5/62) ఐదు వికెట్ల మార్క్‌ని అందుకున్నాడు. అనంతరం ఇంగ్లీష్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకి ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (180: 321 బంతుల్లో 18x4) రికార్డు శతకం నమోదు చేయగా.. మహ్మద్ సిరాజ్ (4/94), ఇషాంత్ శర్మ (3/69) ఆకట్టుకున్నారు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది.

Story first published: Monday, August 16, 2021, 10:17 [IST]
Other articles published on Aug 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+