For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Boss is back: సుదీర్ఘ విరామానికి తెర: తొలి టీ20 ఆడబోతోన్న కింగ్ కోహ్లీ

IND vs ENG 2nd T20: Virat Kohli all set to return T20I after 5 months

లండన్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు..ఇవ్వాళ రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే ముందంజలో ఉంది టీమిండియా. 1-0 తేడాతో ఇంగ్లాండ్‌పై ఆధిక్యతను సాధించింది. సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టీ20లో ప్రత్యర్థిని ఏకంగా 50 పరుగుల తేడాతో మట్టి కరిపించిన కదనోత్సాహంలో కనిపిస్తోంది టీమిండియా. ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ధోరణిలో ఉంది ఇంగ్లాండ్ జట్టు.

భయపెడుతున్న పిచ్..

భయపెడుతున్న పిచ్..

ఈ రెండో టీ20 మ్యాచ్‌కు బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఈ పిచ్ ఘన చరిత్ర ఎలాంటిదో టీమిండియా అభిమానులకు బాగా తెలుసు. ఇంగ్లాండ్‌తో ఆడిన అయిదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓడిన పిచ్ ఇది. మ్యాచ్ మొత్తం మీద భారత జట్టు పట్టు బిగించినప్పటికీ..చిట్టచివరి సెషన్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు విశ్వరూపాన్ని చూపించింది ఈ పిచ్‌పైనే. 200లకు పైగా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారిక్కడ. జో రూట్, జానీ బెయిర్‌స్టో.. సెంచరీలు సాధించి మరీ భారత్‌కు పరాజయాన్ని రూచి చూపించారు.

ఫిబ్రవరిలో చివరి మ్యాచ్..

ఫిబ్రవరిలో చివరి మ్యాచ్..

ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ టీ20 ఇంటర్నేషనల్స్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయిదు నెలల సుదీర్ఘ విరామం తరువాత టీ20ని ఆడబోతోన్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చివరి టీ20 ఆడాడతను. కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో తలపడిన మ్యాచ్ అది. ఆ తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా టోర్నమెంట్ రావడం వల్ల గ్యాప్ ఏర్పడింది. ఐపీఎల్ ముగిసిన తరువాత దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ ఆడినప్పటికీ.. విరాట్ కోహ్లీని ఎంపిక చేయలేదు. విశ్రాంతి కల్పించారు బీసీసీఐ సెలెక్టర్లు.

ఐర్లాండ్ సిరీస్‌కూ..

ఐర్లాండ్ సిరీస్‌కూ..

అదే సమయంలో ఇంగ్లాండ్‌తో అయిదో టెస్ట్ మ్యాచ్ ఆడటానికి జట్టుతో పాటు ఇంగ్లాండ్‌కు బయలుదేరి వచ్చాడు విరాట్ కోహ్లీ. దీనివల్ల ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ సిరీస్‌‌కూ దూరం అయ్యాడు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ తరువాత భారత జట్టు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను ఆడుతోంది. తొలి మ్యాచ్‌ విరాట్ కోహ్లీని తీసుకోలేదు. అతని స్థానాన్ని దీపక్ హుడాతో భర్తీ చేశారు సెలెక్టర్లు. దీపక్ హుడా రాణించాడు. 17 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 33 పరుగులు చేశాడు.

నెట్స్‌లో కఠోరంగా..

నెట్స్‌లో కఠోరంగా..

ఇప్పుడిక విరాట్ కోహ్లీని తుదిజట్టులోకి తీసుకోవడం దాదాపుగా ఖాయమైంది. ఫలితంగా- దీపక్ హుడాకు తుదిజట్టులో చోటు దక్కకపోవచ్చు. ఇవ్వాళ్టి రెండో టీ20 కోసం విరాట్ కోహ్లీ శ్రమించాడు. నెట్స్‌లో కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు. టీమిండియా నెట్ బౌలర్ అనురీత్ సింగ్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ కనిపించాడు. అయిదు నెలల సుదీర్ఘ విరామం, మధ్యలో ఐపీఎల్ 2022 సీజన్ తప్పించితే విరాట్ కోహ్లీ మరో టీ20 ఆడకపోవడం వల్ల ప్రస్తుతం అందరి దృష్టీ అతని మీదే నిలిచింది.

97 మ్యాచ్‌లల్లో..

97 మ్యాచ్‌లల్లో..

ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 97 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. 3,296 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 51.5. చివరి ఆరు మ్యాచ్‌లల్లో విఫలం అయ్యాడు. ఈ ఆరింట్లో అతని బ్యాటింగ్ యావరేజ్ 26 మాత్రమే. 2019 నవంబర్ తరువాత విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ జాలువారలేదు. అన్ని ఫార్మట్లలోనూ అతని బ్యాటింగ్ యావరేజ్ బాగా దిగజారింది. అటు ఐపీఎల్ 2022 సీజన్‌లోనూ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయాడు. 16 మ్యాచ్‌లల్లో 341 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 22.73.

తుదిజట్టు అంచనాలు..

తుదిజట్టు అంచనాలు..

టీమిండియా తుదిజట్టులో.. రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టులో- జోస్ బట్టర్ (కేప్టెన్ వికెట్ కీపర్), జేసన్ రాయ్, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టొన్, హ్యారీ బ్రూక్, సామ్ కుర్రన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లే, మార్క్ పార్కిన్సన్ ఆడొచ్చు.

Story first published: Saturday, July 9, 2022, 12:36 [IST]
Other articles published on Jul 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+