Ind vs Eng 2nd T20: రెండో టీ20కి ముందు ఇరు జట్ల ప్లేయర్లను ఊరిస్తున్న రికార్డులు ఇవే..!

సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత ఆల్రౌండర్ ప్రదర్శన చేయడంతో భారత్ 50పరుగుల భారీ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హార్దిక్ టీ20ల్లో తన హాఫ్ సెంచరీ సాధించగా.. బౌలింగ్లోనూ 4/33తో వికెట్ టేకింగ్ బౌలింగ్ వేశాడు. ఇక ఈ సిరీస్‌లోని రెండో టీ20 మ్యాచ్ నేడు రాత్రి 7గంటకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది. ఇదే స్టేడియంలో ఇటీవల జరిగిన అయిదో టెస్టులో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ వేదికలో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించి.. ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది.

టెస్ట్ ప్లేయర్లు.. టీ20లోకి
ఇకపోతే అయిదో టెస్ట్ ఆడిన విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి సెకండ్ టీ20 మ్యాచ్‌కు జట్టులోకి రాబోతున్నారు. ఇక తొలి టీ20లో పరాభవం తర్వాత ఓపెనర్లు జాసన్ రాయ్, కెప్టెన్ జోస్ బట్లర్ ఓపెనింగ్ స్టాండ్ ఇవ్వడానికి ప్రయత్నించనున్నారు. ఇక ఇంగ్లాండ్ జట్టులో లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ లాంటి హిట్టర్లు ఉండడంతో ఏ స్టేజులోనైనా మ్యాచ్ మలుపు తిరగొచ్చు. దీంతో సిరీస్‌లో సెకండ్ టీ20 చాలా ఉత్కంఠగా సాగడం ఖాయంగా కన్పిస్తుంది. ఇక తొలి టీ20లో రాణించిన అర్షదీప్, దీపక్ హుడా లాంటి ప్లేయర్లు సెకండ్ టీ20కి దూరం అయ్యే అవకాశముండగా.. అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ సైతం బెంచ్‌కే పరిమితం అయ్యే వీలుంది.

ఇప్పటివరకు ఇండియాదే పైచేయి..
ఇప్పటివరకు ఇంగ్లాండ్, భారత్ మధ్య 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగగా.. ఇంగ్లాండ్ తొమ్మిది సార్లు గెలవగా, భారత్ 11 సార్లు గెలుపొందింది. ఇంగ్లాండ్‌లో ఇరు జట్లు 7సార్లు తలపడగా.. ఇంగ్లాండ్ నాలుగు సార్లు, ఇండియా మూడు సార్లు గెలిచింది. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా 13టీ20 మ్యాచ్‌లు గెలవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్, భారత్ మధ్య రెండో టీ20కి ముందు కొన్ని ముఖ్యమైన రికార్డులు ప్లేయర్లను ఊరిస్తున్నాయి.

ఇంగ్లాండ్ ప్లేయర్లను ఊరిస్తున్న రికార్డులు
2 వికెట్లు - క్రిస్ జోర్డాన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 150వికెట్లు తీయడానికి మరో రెండు వికెట్లు తీయాల్సి ఉంటుంది.
50 పరుగులు - టీ20ల్లో 1500పరుగులు పూర్తి చేసేందుకు జాసన్ రాయ్ మరో 50పరుగుల దూరంలో ఉన్నాడు.
ఒక్క ఫోర్ - జాసన్ రాయ్ టీ20లలో 150ఫోర్ల మైలురాయి చేరుకోవడానికి కేవలం ఒక ఫోర్ అవసరం.
30 పరుగులు - జాసన్ రాయ్ అన్ని ఫార్మాట్లలో కలిపి 5500 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 30పరుగుల దూరంలో ఉన్నాడు.

భారత ప్లేయర్లను ఊరిస్తున్న మైలురాళ్లు
2 ఫోర్లు - రోహిత్ శర్మ టీ20ల్లో 300ఫోర్లు సాధించడానికి రెండు ఫోర్ల దూరంలో ఉన్నాడు.
6 సిక్సులు - రోహిత్ టీ20ల్లో 100సిక్సుల మార్క్ చేరుకోవడానికి మరో ఆరు సిక్సర్లు బాదాలి.
2 వికెట్లు - రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 50వికెట్ల మైలురాయిని చేరుకోవడానికి రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు.
3 వికెట్లు - హార్దిక్ పాండ్యా టీ20ల్లో 50 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి మూడు వికెట్లు తీయాలి.
2 ఫోర్లు - టీ20 ఫార్మాట్‌లో 300ఫోర్లు సాధించాలంటే విరాట్ కోహ్లీ మరో రెండు ఫోర్లు కొట్టాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications