For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND VS ENG: భారత బౌలర్లపై SRH ఆల్ రౌండర్ విధ్వంసం.. గ్రౌండ్ షేక్!!

ఐపీఎల్ 2025 సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్‌ఆర్‌హెచ్‌కు గుడ్‌న్యూస్‌. ఆ జట్టు ఆల్ రౌండర్ బ్రైడన్ కార్స్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు. కేవలం 17 బంతుల్లోనే 3 సిక్స్‌లు, ఒక ఫోర్ తో 31 పరుగులు సాధించాడు. తాజాగా ఇంగ్లాండ్ - టీమిండియా మధ్య థ్రిల్లింగ్ గా సాగిన రెండో టీ20లో ఈ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు బ్రైడన్. భారత్ పిచ్‌లపై అతడు తొలి సారి ఆడినప్పటికీ.. ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా క్రికెట్ ప్రియులను మెప్పించాడు.

చెన్నై వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన రెండో టీ20లో 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఓట‌మిని అందుకున్నప్పటికీ.. ఆల్‌రౌండ‌ర్ బ్రైడన్ కార్స్ అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌లోనూ మంచిగా రాణించాడు. 8వ స్ధానంలో బ్యాటింగ్ కు దిగిన బ్రైడన్ కార్స్‌.. భార‌త బౌల‌ర్ల‌పై విరుచుకుపడేలా ఆడాడు. కేవలం 17 బంతుల్లో 3 సిక్స్ లు, ఒక ఫోర్ సాయంతో 31 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్‌లోనూ మెరిశాడు బ్రైడన్. తన 4 ఓవర్ల కోటాలో 29 పరుగులు సమర్పింపుచుకుని మూడు వికెట్లు తీశాడు.

IND VS ENG 2nd T20 SRH Brydon Carse hits three sixes one four scored 31 runs in ongoing england series

సన్ రైజర్స్ కు కలిసొచ్చే విషయం
బ్రైడన్ కార్స్ భారత గడ్డపై ఇలాంటి ప్రదర్శన కనబరచడం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కలిసొచ్చే విషయమనే చెప్పాలి. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో కార్స్‌ను హైదరాబాద్ జట్టే కేవలం రూ. కోటి దక్కించుకుంది. కాబట్టి అతడు ఐపీఎల్ లోనూ ఇలాంటి మంచి ప్రదర్శనే చేస్తాడని సన్ రైజర్స్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఆర్‌హెచ్‌లో అభిషేక్ శ‌ర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ప్యాట్ క‌మ్మిన్స్ లాంటి బలమైన ఆల్‌రౌండ‌ర్లు ఉన్నారు. ఇప్పుడు కార్స్ రాకతో సన్ రైజర్స్ ఆల్‌రౌండ్ విభాగం మరింత బలంగా మారినట్టైంది.

మొత్తంగా కార్స్ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 5 టీ20లు ఆడాడు. మొత్తంగా 9 వికెట్లు తీశాడు.సౌతాఫ్రికా టీ20, ది హండ్రెడ్, వైటాలిటీ బ్లాస్ట్‌ లీగ్ ల్లోనూ ఈ ఆల్‌రౌండర్ ఆడాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు ఇదే: పాట్ కమిన్స్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, రాహుల్ చాహర్, ఇషాన్ కిషన్ , అథర్వ తైదే, ఆడమ్ జంపా , సిమర్జిత్ సింగ్, అభినవ్ మనోహర్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, కమిందు మెండిస్ , బ్రైడన్ కార్సే, ఎషాన్ మలింగ , అనికేత్ వర్మ , సచిన్ బేబీ.

Story first published: Sunday, January 26, 2025, 11:36 [IST]
Other articles published on Jan 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+