For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ind vs Eng 2nd T20 : కొంపముంచిన మూడో రన్.. భారీ స్కోరు మిస్, ఇంగ్లాండ్ ముందు మోస్తరు టార్గెట్

Ind vs Eng 2nd T20: Ravindra Jadeja gave a stand till the end and India managed to score 170

బర్మింగ్‌హమ్ : ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టీ20లో ఇండియా బ్యాటింగ్లో తడబడింది. కొత్త కుర్రాడు రీచార్డ్ గ్లీసన్ (4-1-15-3) నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్ 3వికెట్లు (రోహిత్, కోహ్లీ, పంత్) తీయడంతో పాటు, క్రిస్ జోర్డాన్ 4వికెట్లతో చెలరేగడంతో ఇండియా ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇక చివర్లో రవీంద్రా జడేజా (46పరుగులు 29బంతుల్లో 5ఫోర్లు) చెలరేగడంతో నిర్ణీత 20ఓవర్లలో ఇండియా 8వికెట్లు కోల్పోయి 170పరుగులు చేసింది. ఇక 171పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం ఇండియన్ బౌలర్ల చేతిలో ఉంది.

 తొలి వికెట్‌కు 49పరుగులు

తొలి వికెట్‌కు 49పరుగులు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జోస్ బట్లర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్లో ఇండియా తరఫున రిషబ్ పంత్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇక తొలి ఓవర్లోనే ఒక్క పరుగు వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను జాసన్ రాయ్ మిస్ చేయడంతో.. హిట్ మ్యాన్ కాసేపు అలరించాడు. సామ్ కరన్ వేసిన రెండో ఓవర్లో రిషబ్ పంత్ ఫోర్‌ కొట్టి స్కోరు బోర్డు మూమెంటమ్ పెంచగా.. విల్లీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి రోహిత్ సిక్సుతో హిట్టింగ్ మొదలెట్టాడు. పంత్ సైతం రెండు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్లో 17పరుగులొచ్చాయి. వీరిద్దరు తొలి వికెట్‌కు 4.5ఓవర్లలోనే 49పరుగులు చేశారు. ఈ జోడీని ఇంగ్లాండ్ తరఫున ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన కొత్త కుర్రాడు రిచార్డ్ గ్లీసన్ విడదీశాడు. హిట్టింగ్ చేయాలని చూసిన రోహిత్ (20బంతుల్లో 31పరుగులు 3ఫోర్లు, 2సిక్సర్లు) కీపర్ బట్లర్ పట్టిన అద్భుత క్యాచ్‌కు ఔటయిపోయాడు.

టాపార్డర్‌ను కుప్పకూల్చిన గ్లీసన్

టాపార్డర్‌ను కుప్పకూల్చిన గ్లీసన్

ఇక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ తానింక ఏం మారలేదు అన్నట్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. రిచార్డ్ గ్లీసన్ వేసిన 7వ ఓవర్ తొలి బంతికి నిర్లక్ష్యకర రీతిలో హిట్ చేసి ఒక్క పరుగుకే క్యాచ్ ఔటయిపోయాడు. 7వ ఓవర్ రెండో బంతికి పంత్ (26పరుగులు 15బంతుల్లో 4ఫోర్లు 1సిక్సర్) సైతం కీపర్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో స్కోరుబోర్డుకు కళ్లెం పడింది. హార్దిక్ పాండ్యా (12పరుగులు) , సూర్యకుమార్ (15పరుగులు) సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వీరిద్దరు జోర్డాన్ వేసిన 11వ ఓవర్లో వరుస బంతుల్లో క్యాచ్ ఔటయిపోయారు.

 బట్లర్, బ్రూక్ దెబ్బకు దినేష్ కార్తీక్ రనౌట్

బట్లర్, బ్రూక్ దెబ్బకు దినేష్ కార్తీక్ రనౌట్

ఇక క్రీజులో కాసేపు చాలా జాగ్రత్తగా దినేష్ కార్తీక్, రవీంద్రా జడేజా ఆడారు. ఇక లివింగ్ స్టన్ వేసిన 16వ ఓవర్ తొలిబంతికి బౌండరీ వద్ద అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన హ్యారీ బ్రూక్.. సరైన త్రో వేయడం, బట్లర్ అద్భుతంగా అందుకుని వికెట్లను గిరటేయడంతో మూడో రన్ తీస్తుండగా దినేష్ కార్తీక్ (12పరుగులు 17బంతుల్లో) రనౌట్ అయిపోయాడు. బాగా డైవ్ చేసినా లైన్ అందుకోలేకపోయాడు. అప్పటికీ క్రీజులో కుదురుకున్న దినేష్ కార్తీక్ మంచి హిట్టింగ్ చేసేవాడే. కానీ ఆ రనౌట్ ఇండియా కొంపముంచింది. ఇక క్రీజులోకి వచ్చిన హర్షల్ పటేల్ (13పరుగులు 6బంతుల్లో 1ఫోర్, 1 సిక్సర్) పర్వాలేదనిపించాడు. ఇక చివర్లో రవీంద్రా జడేజా (46పరుగులు 29బంతుల్లో) రాణించడంతో ఇండియా 170పరుగులు చేయగలిగింది.

తుది జట్లు:

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్సన్

Story first published: Saturday, July 9, 2022, 20:59 [IST]
Other articles published on Jul 9, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+