Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng 2nd T20 : బౌలింగ్ ఎంచుకున్న బట్లర్.. 4మార్పులతో ఇండియా.. పంత్, రోహిత్ ఓపెనింగ్..!

Ind vs Eng 2nd T20 Playing 11: England have won the toss and have opted to Bowl First

బర్మింగ్‌హమ్ : సౌతాంప్టన్‌లోని రోజ్‌బౌల్‌ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా అద్భుత ఆల్రౌండర్ ప్రదర్శన వల్ల టీమిండియా 50పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హార్దిక్ టీ20ల్లో తన హాఫ్ సెంచరీ సాధించగా.. బౌలింగ్లోనూ 4/33తో వికెట్ టేకింగ్ బౌలింగ్ వేశాడు. ఇక ఈ సిరీస్‌లోని రెండో టీ20 మ్యాచ్ నేడు రాత్రి 7గంటకు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రారంభం కానుంది. ఇదే స్టేడియంలో ఇటీవల జరిగిన అయిదో టెస్టులో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ వేదికలో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించి.. ఇండియా సిరీస్ గెలవడంతో పాటు ఇంగ్లాండ్‌‌తో లెక్క సరిచేయాలని చూస్తోంది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జోస్ బట్లర్ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. టోప్లీ మరియు మిల్స్ స్థానాల్లో విల్లీ, గ్లీసన్ తుది జట్టులోకి వచ్చారు. గ్లీసన్ ఈరోజు తన అరంగేట్రం చేయబోతున్నాడు. సిరీస్లో తిరిగి పుంజుకోవడానికి ఇది మాకు మంచి అవకాశం, ఈ రోజు మేం కమ్ బ్యాక్ అవుతామని ఆశిస్తున్నా. ఇది మంచి స్టేడియం, ఇక్కడ భారత్‌కు కూడా గొప్ప మద్దతు లభిస్తుంది. అన్నాడు.

ఇక టాస్ ఓడిన రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాం. ఏదేమైనా అదే జరిగింది. మంచి పిచ్‌గా కనిపిస్తోంది. మా జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. కోహ్లీ, జడేజా, బుమ్రా, పంత్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇక ఇంగ్లాండ్ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో ఒకటి. కాబట్టి మమ్మల్ని మేం సవాలు చేసుకుని ఈ సిరీస్ విన్ కావాలనుకుంటున్నాం. మేము సౌతాంప్టన్‌లో ఎలా ఆడామో దాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. మేం కూడా ఫియర్ లెస్ క్రికెట్ ఆడగలం. అయితే పరిస్థితులను కూడా గమనించాలి అని రోహిత్ తెలిపాడు. ఇకపోతే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసే అవకాశముంది. ఒకవేళ అది కుదరకపోతే పంత్‌ కూడా ఓపెనర్‌గా బరిలోకి దిగొచ్చు.

తుది జట్లు:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్సన్

Story first published: Saturday, July 9, 2022, 19:16 [IST]
Other articles published on Jul 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+