Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దెబ్బ అదుర్సా..! టెస్ట్ సిరీస్ మిస్సయిన చోటే.. టీ20 సిరీస్ అందుకున్న ఇండియా, అట్లుంటది రోహిత్‌తోని

rohit

బర్మింగ్‌హమ్ : ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టీ20లో ఇండియా సాధికారిక విజయం సాధించింది. ఇక మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ 2-0తేడాతో గెలుపొందింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 170పరుగులు చేసింది. ఇక 171పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భువీ నిప్పులు చెరిగే బంతులతో వణికించగా.. బుమ్రా తన మాస్ పేస్‌తో గడగడలాడించాడు. దీంతో ఇంగ్లాండ్ 121పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇండియా 49 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఇక బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ (3-1-15-3) మూడు ఓవర్లలో ఒక మెయిడిన్ వేసి 15పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. బుమ్రా (3-1-10-2) మూడు ఓవర్లలో ఒక మెయిడిన్ వేసిన కేవలం 10పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. చాహల్ 2, హార్దిక్ 1, హర్షల్ 1 వికెట్‌తో రాణించి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్సీ చేపట్టిన తొలి సిరీస్లోనే బట్లర్ ఓటమి చవిచూడగా.. రోహిత్ శర్మ వరుసగా 14 టీ20 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇటీవలే ఎడ్జ్ బాస్టన్‌లో జరిగిన టెస్టులో ఓడిన ఇండియా.. సిరీస్ గెలిచే అవకాశం మిస్ చేసుకోగా.. అదే వేదికగా ఇంగ్లాండ్‌ను ఓడించి టీ20 సిరీస్ గెలుచుకుని దెబ్బకు దెబ్బ తీసింది.

తొలి బంతికే షాకిచ్చిన భువీ

తొలి బంతికే షాకిచ్చిన భువీ

ఇక టార్గెట్ ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు తొలి బంతికే భువీ షాకిచ్చాడు. జాసన్ రాయ్‌ను తన ఔట్ స్వింగర్‌తో బురిడీ కొట్టించాడు. దీంతో గోల్డెన్ డక్‌గా జాసన్ రాయ్ స్లిప్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ బట్లర్ (4)ను కూడా కీపర్ క్యాచ్ ఔట్ చేశాడు. ఇక రోహిత్ తెలివిగా బట్లర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కీపర్ పంత్‌ను వికెట్ల వెనకలే ఉంచడంతో బట్లర్ హిట్టింగ్ చేయాలని చూడగా.. బ్యాట్‌కు ఎడ్జ్ అయి పంత్ చేతుల్లోకి బాల్ వెళ్లింది. ఇక కాస్త దూకుడుగా ఆడదామని చూసిన లివింగ్ స్టన్ (15) వచ్చినా లైఫ్‌ను యూజ్ చేసుకోలేకపోయాడు. బుమ్రా చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

 రోహిత్ మాస్టర్ టెక్నిక్‌తో మొయిన్ అలీకి బురిడీ

రోహిత్ మాస్టర్ టెక్నిక్‌తో మొయిన్ అలీకి బురిడీ

తర్వాత బ్రూక్ (8), డేవిడ్ మలన్ (19)లను చాహల్ తన మాస్టర్ క్లాస్ స్పిన్‌తో బుట్టలో వేసుకున్నాడు. ఇక సామ్ కరన్ (2) బుమ్రా వేసిన స్లో స్లాట్ బంతికి హిట్ చేయాలా వద్దా అన్న డైలామాలో హిట్ చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక కాసేపు మొయిన్ అలీ (35పరుగులు 21బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) పోరాటం కనబరిచాడు. కానీ రోహిత్ తన మాస్టర్ టెక్నిక్‌తో హార్దిక్ పాండ్యా చేత వైడ్ ఆఫ్ స్టంప్ వేయించగా.. మొయిన్ అలీ హిట్ చేయాలని చూసి లాంగాఫ్లో రోహిత్ క్యాచ్ పట్టేయడంతో అలీ పోరాటం ముగిసింది.

డేవిడ్ విల్లీ పోరాడినా..

డేవిడ్ విల్లీ పోరాడినా..

ఇక ఆ తర్వాత కాసేపు డేవిడ్ విల్లీ (33పరుగులు 22బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సులు) పోరాట పటిమ కనబరిచాడు. అయితే సమన్వయ లోపంతో క్రిస్ జోర్డాన్ (1)రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కొత్త కుర్రాడు గ్లాసిన్‌ (2)ను భువీ పెవిలియన్ పంపించాడు. ఇక హర్షల్ పటేల్ బౌలింగ్లో సిక్సర్ ఫోర్ కొట్టిన విల్లీ 5బంతికి సింగిల్ తీసిచ్చాడు. కానీ ఆరోబంతికి పార్కిన్సన్‌ను హర్షల్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 17ఓవర్లకు 121పరుగులకే ముగిసింది. దీంతో సిరీస్ ఇండియా వశమైంది. ఇటీవలే ఎడ్జ్ బాస్టన్‌లో జరిగిన టెస్టులో ఓడిన ఇండియా.. అదే వేదికగా ఇంగ్లాండ్‌ను ఓడించి దెబ్బకు దెబ్బ తీసింది.

అంతకుముందు జడ్డూ, పంత్, రోహిత్ రాణించడంతో..

అంతకుముందు జడ్డూ, పంత్, రోహిత్ రాణించడంతో..

ఇక అంతకుముందు బ్యాటింగ్లో టీమిండియా బ్యాటర్లు రోహిత్ (20బంతుల్లో 31పరుగులు 3ఫోర్లు, 2సిక్సర్లు), పంత్ (26పరుగులు 15బంతుల్లో 4ఫోర్లు 1సిక్సర్) , రవీంద్రా జడేజా (46పరుగులు 29బంతుల్లో) రాణించడంతో ఇండియా 170పరుగులు చేయగలిగింది. కొత్త కుర్రాడు రీచార్డ్ గ్లీసన్ (4-1-15-3) నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్ సహా 3వికెట్లు (రోహిత్, కోహ్లీ, పంత్) తీయడంతో పాటు, క్రిస్ జోర్డాన్ 4వికెట్లతో రాణించారు.

తుది జట్లు:

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మాథ్యూ పార్కిన్సన్

Story first published: Sunday, July 10, 2022, 7:14 [IST]
Other articles published on Jul 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+