ఇంగ్లాండ్ పై తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. అందుకే కటక్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లాండ్ చూస్తోంది. మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
అయితే ఈ మ్యాచ్ తో రెండు మార్పులతో బరిలోకి దిగింది టీమిండియా. విరాట్ కోహ్లీ కోసం యశస్వి జైశ్వాల్ ను పక్కన పెట్టారు. తొలి వన్డేకు గాయం కారణంగా దూరమైన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి తిరిగి జట్టులోకి జట్టులోకి వచ్చాడు. ఇక కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌తోనే వన్డేల్లోకి వరుణ్ చక్రవర్తి అరంగేట్రం చేశాడు. రవీంద్ర జడేజా అతడికి క్యాచ్ ను అందించాడు. టీ20ల్లో మంచి ప్రదర్శన కనబరుస్తుండడం వల్ల వరుణ్‌కు వన్డేల్లో అవకాశం ఇచ్చారు. అలానే తొలి మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్.. రెండో మ్యాచ్ బరిలోనూ దిగాడు.

మరోవైపు ఇంగ్లాండ్ కూడా తమ జట్టులో మూడు మార్పులు చేసి బరిలోకి దిగింది. కార్స్, జాకబ్ బెతల్, అర్చర్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో మార్క్ వుడ్, గుస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చారు.
భారత తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్ తుది జట్టు
ఇంగ్లాండ్ : బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్