Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng 2nd ODI : లార్డ్స్‌లో ధోనీ, రైనా, దాదా, భజ్జీ, సచిన్ సందడి.. !

Ind vs Eng 2nd ODI : Teamindia Former Players Ganguly, sachin, Raina, Harbhajan On Lords Stand

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ చూడ్డానికి భారత్ జట్టు మాజీ క్రికెటర్లు తరలివచ్చారు. 2011 వన్డే ప్రపంచకప్ టీంలో సభ్యులుగా ఉన్నవాళ్లలో నలుగురు అయిదుగురు ఈ మ్యాచ్ చూడ్డానికి రావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌కు ముందు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది మాత్రం రైనా, ధోనీలే. వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెద్ద తాల, చిన్న తాల కలిశారు అంటూ ట్విట్టరులో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక సచిన్, సౌరవ్ గంగూలీ ఒకే చోట కూర్చుని మ్యాచ్ వీక్షిస్తున్న విజువల్స్ కెమెరాలో పదే పదే కన్పించాయి. వీరిద్దరు స్క్రీన్ మీద కన్పించినప్పుడల్లా స్టేడియంలో సందడి నెలకొంది. ఇక హర్భజన్, రైనా ఒకే చోట కూర్చుని మ్యాచ్ వీక్షించారు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్లో పర్వాలేదనిపించింది.

యుజ్వేంద్ర చాహల్ దెబ్బకు బెయిర్ స్టో (38) క్లీన్ బౌల్డ్ కాగా.. రూట్(11) , స్టోక్స్ (21) క్లీన్ ఎల్బీడబ్ల్యూలుగా, మొయిన్ అలీ (47) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు. ఇక జాసన్ రాయ్ (23), లివింగ్ స్టోన్ (33)లను హార్దిక్ ఔట్ చేశాడు. కెప్టెన్ బట్లర్ (4)ను షమీ బౌల్డ్ చేశాడు. విల్లీ (41), టోప్లే (3)లను బుమ్రా ఔట్ చేయగా బైడెన్ కార్స్ (2)ను ప్రసీద్ ఔట్ చేశాడు. దీంతో 49ఓవర్లకు ఇంగ్లాండ్ 246పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఛేదనకు దిగిన ఇండియా ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (0) వికెట్ కోల్పోయింది. అలాగే ధావన్ (9పరుగులు) కూడా ఔటయ్యాడు.

తుది జట్లు :
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

Story first published: Thursday, July 14, 2022, 22:41 [IST]
Other articles published on Jul 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+