ఇంగ్లాండ్ తో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘతన సాధించాడు. కెప్టెన్ గా రోహిత్ కు ఇది 50వ మ్యాచ్ ఇదే కావడం విశేషం. తద్వారా వన్డేల్లో 50కు పైగా మ్యాచ్ లకు సారథ్యం వహించిన 8వ క్రికెటర్ గా నిలిచాడు. ఈ జాబితాలో మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 200 మ్యాచులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత మహ్మద్ అజారుద్దీన్ (174), సౌరవ్ గంగూలీ (146), విరాట్ కోహ్లీ (95), రాహుల్ ద్రవిడ్ (79), కపిల్ దేవ్ (74), సచిన్ తెందుల్కర్ (73) ఉన్నారు. కాగా, వన్డేల్లో రోహిత్ శర్మ తొలి సారి 2017లో సారథ్యం వహించాడు.
బెస్ట్ విన్ కెప్టెన్ గా...
అలానే బెస్ట్ విన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. 72.9 శాతంతో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన సారథిగా రోహిత్ నిలిచాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో (69.8 శాతం), ఎంఎస్ ధోనీ (58.2 శాతం), రాహుల్ ద్రవిడ్ (56 శాతంలో) ఉన్నారు.

వన్డే క్రికెట్ లో రోహిత్ కెప్టెన్ గా ఇప్పటివరకు (ప్రస్తుతం జరుగుతోన్న రెండో మినహా) 35 విజయాలను అందించాడు. మరో 12 వన్డేల్లో ఓటమిని అందుకోగా, ఒక మ్యాట్ టై అయింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 2018 వన్డే ఆసియా కప్ ను టీమిండియా గెలిచింది. ఈ టోర్నీ ఫైనల్ లో బంగ్లాదేశ్ ను ఓడించి విజయం సాధించింది. 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ కూడా రోహిత్ శర్మ నాయకత్వంలోనే ఆడింది.
కెప్టెన్ గా రోహిత్ పరుగులు
వన్డేల్లో భారత్ తరఫున కెప్టెన్ గా 2 వేలకుపైగా పరుగులు చేసిన ఏడో క్రికెటర్ గా రోహిత్ శర్మ. ఇప్పటివరకు (ప్రస్తుతం జరుగుతోన్న రెండో మినహా) 2206 పరుగులను 112.20 స్ట్రైక్ రేట్ తో, 53.80 యావరేజ్ తో చేశాడు. అందులో 20కుపైగా హాఫ్ సెంచరీలు ఉన్నాయి.