England Playing 11: జాసన్ రాయ్, ఓవర్టన్ ఔట్.. వారి స్థానంలో ఎవరంటే.. రెండో వన్డేకు ఇంగ్లాండ్ టీం ఇదే..!

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇండియా 10వికెట్ల తేడాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డే జరగబోతుంది. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లాండ్.. రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌లో ఇంకా కొనసాగాలని చూస్తోంది. ప్రస్తుతం సిరీస్లో భారత్ 1-0తేడాతో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ వన్డే చరిత్రలోనే స్వదేశంలో ఎప్పుడూ 10వికెట్ల తేడాతో ఓడిపోలేదు. దీంతో బట్లర్ సేన మీద భారీ ప్రెషర్ ఉంటుంది. ఇకపోతే ఇటీవల టీ20 సిరీస్లో పూర్తిగా నిరాశపర్చిన జాసన్ రాయ్.. వన్డేలోనూ తొలి మ్యాచ్‌లో డక్ ఔట్ అయ్యాడు. స్వింగ్ బంతులను ఎదుర్కోవడంతో రాయ్ పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. వన్డేల్లో మ్యాచ్ గెలవాలంటే ఓపెనింగ్ స్టాండ్ తప్పకుండా బాగుండాలి. ఇంగ్లాండ్ జట్టు అది మిస్సవకూడదని చూస్తోంది.

ఓపెనింగ్ స్టాండ్ కోసం అతన్ని బరిలోకి..
దీంతో రాయ్ స్థానంలో డిఫెన్స్ ప్లేయర్లను ఓపెనర్‌గా బరిలోకి దించాలని చూస్తుంది. ఇక ఈ క్రమంలో మిస్టర్ క్లాస్ జో రూట్ ఓపెనర్‌గా బరిలోకి దిగొచ్చు లేకపోతే.. రాయ్ స్థానంలో ఫిలిప్ సాల్ట్ తుది జట్టులోకి రావొచ్చు. ఇక జాసన్ రాయ్ లాంటి మ్యాచ్ విన్నర్‌ను తప్పించడానికి ఇంగ్లాండ్ జట్టు యాజమాన్యం మల్లాగుల్లాలు పడాల్సిందే. ఎందుకంటే తొలి వన్డేలో జాసన్ రాయ్ కాకుండా టాపార్డర్ మొత్తం విఫలమయ్యారు. దీంతో కేవలం జాసన్ రాయ్‌ను మాత్రమే తప్పిస్తే ఇంగ్లాండ్ లెజెండరీ మాజీల నుంచి విమర్శలను టీం మేనేజ్ మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అలాగే క్రెయిగ్ ఓవర్టన్ స్థానంలో సామ్ కరన్‌ను ఇంగ్లాండ్ బరిలోకి దింపే అవకాశముంది. ఇటీవల బౌలింగ్ పరంగా సామ్ కరన్ కాస్త బానే ప్రదర్శన చేస్తుండడంతో అతన్ని తీసుకునే వీలుంది. కరన్ ఆల్రౌండర్ కూడా. ఇక జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను ఓసారి పరిశీలిస్తే

టాపార్డర్లో వీరు
తుది జట్టులో ఓపెనర్ల విషయంలో ఇంగ్లాండ్ చాలా పునరాలోచనలు చేస్తుంది. ఓపెనింగ్ వికెట్ కాపాడే ప్లేయర్ కోసం చూస్తుంది. ఓ ఎండ్‌లో బెయిర్ స్టో స్థానం ఫిక్స్ కాగా.. మరో ఎండ్‌లో జాసన్ రాయ్‌ను తప్పించి ఫిలిప్ సాల్ట్ గానీ జో రూట్ గానీ బరిలోకి దిగే అవకాశముంది. ఇక ఒకవేళ ఫిలిప్ సాల్ట్ ఓపెనర్‌గా బరిలోకి దిగితే తర్వాత రూట్ యథావిధిగా వన్ డౌన్లో బరిలోకి వస్తాడు.

మిడిలార్డర్లో వీరు
ఇంగ్లాండ్ మిడిలార్డర్ అత్యంత దుర్భేద్యంగా ఉంది. అయితే తొలి వన్డేలో మాత్రం వీళ్లందరూ పేపర్ పులులుగానే మిగిలిపోయారు. దీంతో మిడిలార్డర్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో పుంజుకోవాల్సిన అవసరముంది. ఇక నంబర్ 4 స్థానంలో ఎప్పటిలాగే బెన్ స్టోక్స్, నంబర్ 5 స్థానంలో కెప్టెన్ జాస్ బట్లర్, నంబర్ 6 స్థానంలో మొయిన్ అలీ తమ పాత్ర పోషించడానికి సిద్ధమవుతారు. స్టోక్స్, అలీ మంచి ఆల్రౌండర్లన్న విషయం తెలిసిందే. ఇకపోతే లియామ్ లివింగ్‌స్టోన్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో దిగువన పంపించేందుకు ఇంగ్లాండ్ యోచిస్తున్నట్లు కన్పిస్తుంది. వచ్చీ రాగానే హిట్టింగ్ చేసే లియామ్ వికెట్ పోగొట్టుకుంటే తర్వాత బ్యాటర్లపై ప్రెషర్ పడుతుంది కాబట్టి అతన్ని నంబర్ 7బ్యాటర్‌గా బరిలోకి దించొచ్చు.

బౌలర్లుగా వీరు
ఇంగ్లాండ్ బ్యాటింగ్ యూనిట్ బాగున్నా.. బౌలింగ్ మాత్రం అంచనాలు అందుకోలేకపోతుంది. జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ లాంటి ప్లేయర్లు లేని లోటు ఆ జట్టులో స్పష్టంగా కన్పిస్తుంది. ఇక బౌలింగ్ పరంగా ఆ జట్టు తరఫున సామ్ కరాన్, బైర్డన్ క్రాస్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లీ ఆడతారు. ఇంగ్లాండ్ పిచ్‌లు బేసిక్‌గా పేసర్లకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి స్పెషలిస్టు స్పిన్నర్లను ఇంగ్లాండ్ బరిలోకి తీసుకోకపోవచ్చు. వీరితో పాటు బౌలింగ్ విభాగాన్ని మొయిన్ అలీ, లివింగ్ స్టోన్, స్టోక్స్‌తో కెప్టెన్ బట్లర్ నడిపించనున్నాడు.

ఇంగ్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11
1. ఫిలిప్ సాల్ట్, 2.జానీ బెయిర్ స్టో, 3.జో రూట్, 4.బెన్ స్టోక్స్, 5.జాస్ బట్లర్ (కీపర్, కెప్టెన్), 6.మొయిన్ అలీ, 7.లియామ్ లివింగ్ స్టోన్, 8.సామ్ కరన్, 9. డేవిడ్ విల్లీ, 10.బైర్డన్ క్రాస్, 11.రీస్ టోప్లే
ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11
1.రోహిత్ శర్మ (కెప్టెన్), 2.శిఖర్ ధావన్, 3.శ్రేయస్ అయ్యర్, 4.సూర్యకుమార్ యాదవ్, 5.హార్దిక్ పాండ్యా, 6.రిషభ్ పంత్ (కీపర్), 7.రవీంద్ర జడేజా, 8.ప్రసిద్ కృష్ణ, 9.మహమ్మద్ షమీ, 10.జస్‌ప్రీత్ బుమ్రా, 11.యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications