
ఛేజింగ్ చేయడానికి ఓ స్కోరు ఉంటే బాగుంటుందని
ఇక టాస్ గెలిచిన రోహిత్ శర్మ మాట్లాడుతూ.. మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. తక్కువ గ్రాస్ కచ్చితంగా ఉంది కానీ పిచ్‌లో కొంత తేమ ఉన్న విషయం అర్థం అవుతోంది. మా ముందు ఛేజింగ్‌కు ఓ స్కోర్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నా. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో విరాట్ కోహ్లీ తిరిగి వచ్చాడు.
ఏ ఫార్మాట్‌లో ఉన్నా బుమ్రా మాకు సరైన బౌలర్. ఏ దశల్లోనైనా బౌలింగ్ చేయగల సమర్థుడు. అతనిలాంటి బౌలర్ జట్టులో ఉండటం ఎప్పుడూ సంతోషమే. ఇక రిషబ్ పంత్ సైతం కొన్ని మంచి క్యాచ్‌లు గత మ్యాచ్‌లో పట్టాడు. అవి మాకు చాలా కీలకమైనవి. ఇక లార్డ్స్ ప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియంలలో ఒకటి. కాబట్టి మా జట్టు బాగా ఆడాలని చూస్తోంది. ప్రస్తుతం వాతావరణం క్లౌడీగా ఉంది. కాబట్టి ఇది బౌలింగ్‌కు అనుకూలమని భావిస్తున్నాను.

మేము గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లం
వరుసగా రెండో సారి టాస్ ఓడిన జోస్ బట్లర్ మాట్లాడుతూ.. 'మేము టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. కొంచెం తేమ కన్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభంలో కాసేపు బౌలింగ్‌ను తట్టుకోవాలి. మేము సేమ్ టీంతో ఆడబోతున్నాం. బ్యాటింగ్ మా ప్రధాన బలం అని మేము ఎప్పుడూ అనుకుంటాము. ఇక గత మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన మా బ్యాటింగ్ పరంగా లోపముందని నేను అనుకోను. లార్డ్స్‌లో ఆడుతున్నప్పుడు చాలా గొప్ప అనుభూతి ఉంటుంది.' అని పేర్కొన్నాడు.

తుది జట్లు :
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ


Click it and Unblock the Notifications












