Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng 2nd ODI : అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా? కోహ్లీ పాపం..! ఓటమి దిశగా ఇండియా!

virat kohli

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49ఓవర్లకు 246పరుగులు చేసి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. యుజ్వేంద్ర చాహల్ 4, హార్దిక్ పాండ్యా 2, బుమ్రా 2, షమీ 1, ప్రసీద్ 1వికెట్ తీసి రాణించారు. ఇక ఇంగ్లాండ్ టీం తరఫున మొయిన్ అలీ (47పరుగులు 64బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), డేవిడ్ విల్లీ (41పరుగులు 49బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించారు. ఇక ఇండియా 247పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి ఆదిలోనే దెబ్బతింది. టోప్లే, డేవిడ్ విల్లీ తొలి స్పెల్లోనే అదరగొట్టారు. వీరిద్దరు స్వింగ్ బౌలింగ్‌తో ఇండియా టాపార్డర్‌ను కూల్చారు. వీరి దెబ్బకు 31పరుగులకే ఇండియా 4వికెట్లు కోల్పోయింది.

3వ ఓవర్లో టోప్లే బౌలింగ్లో రోహిత్ (0) ఎల్బీడబ్ల్యూగా డకౌట్ అయిపోయాడు. రివ్యూ తీసుకున్నా నిరాశే మిగిలింది. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడు ఫోర్లు కొట్టి అలరించాడు. ఇక కోహ్లీ మంచి టచ్‌లోకి వచ్చినట్లే కన్పించాడు. ఇక టోప్లే బౌలింగ్లో ఫోర్ కొట్టిన ధావన్ (9) వైడ్ బంతిని అనవసరంగా టచ్ చేయడంతో కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ఆ తర్వాత 4వ స్థానంలో బరిలోకి వచ్చిన రిషబ్ పంత్ (0).. బ్రైడన్ కార్స్ వేసిన బౌలింగ్లో లూజ్ షాట్ ఆడి మిడాఫ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత డేవిడ్ విల్లీ బౌలింగ్లో కోహ్లీ (16పరుగులు 25బంతుల్లో 3ఫోర్లు) కూడా ఎప్పటిలాగే వైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కవర్స్‌లో ఆడబోయే కట్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ఇక 31పరుగులకే 4వికెట్లు కోల్పోయిన ఇండియాను సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ సూర్య ఓ సిక్స్ కూడా కొట్టి మంచి టచ్‌లో కనిపించాడు. కానీ మళ్లీ బౌలింగ్‌కు దిగిన టోప్లే సూర్య కుమార్ యాదవ్ (27పరుగులు 29బంతుల్లో 1ఫోర్, 1సిక్స్)ను బౌల్డ్ చేశాడు. దీంతో 42పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. 73పరుగులకు 5వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇండియాను రవీంద్రా జడేజా, హార్దిక్ పాండ్యా కాసేపు పోటీలో నిలిపారు. 101పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా (29పరుగులు 44బంతుల్లో 2ఫోర్లు) కూడా మొయిన్ అలీ బౌలింగ్లో హిట్టింగ్ చేయాలని చూసి ఔటయిపోయాడు. దీంతో 6వికెట్లు కోల్పోయి ఇండియా ఓటమి దిశగా సాగుతుంది. క్రీజులో రవీంద్రా జడేజా, షమీ ఉన్నారు.

తుది జట్లు :
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

Story first published: Thursday, July 14, 2022, 23:54 [IST]
Other articles published on Jul 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+