Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng 2nd ODI : లార్డ్స్‌లో టాప్‌ లేపిన టోప్లీ.. ఇండియాపై ఇంగ్లాండ్ ఘన విజయం

topley

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ విధించిన 247పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఛేదించలేకపోయింది. 146పరుగులకే ఆలౌటైంది. దీంతో 100పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయింది. లార్డ్స్ గ్రౌండ్లోనూ, అలాగే కెరీర్లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లాండ్ బౌలర్ టోప్లీ.. ఇండియా బ్యాటింగ్ లైనప్ టాప్ లేపాడు. అలాగే ఇంగ్లాండ్ తరఫున అత్యుత్తమ వన్డే బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు. అతను 9.5ఓవర్లలో కేవలం 24పరుగులు మాత్రమే ఇచ్చి 6వికెట్లు తీశాడు. తద్వారా లార్డ్స్‌లో వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్‌గా కూడా పేరొందాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్స్, లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ తలా ఓ వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా రీస్ టోప్లీ నిలిచాడు.

టోప్లీ ప్రతాపానికి ఇండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ

టోప్లీ ప్రతాపానికి ఇండియా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ

టోప్లీ ప్రతాపానికి ఇండియా టాపార్డర్, లోయర్ ఆర్డర్ కుప్పకూలింది. అతను టాపార్డర్లో తొలుత రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (9), సూర్యకుమార్ యాదవ్ (27)లను ఔట్ చేశాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో షమీ (23), చాహల్ (3), ప్రసీద్ క్రిష్ణ (0)లను ఔట్ చేశాడు. టోప్లీ బౌలింగ్ ధాటిగా పడడంతో ఇండియా బ్యాటర్లు అతన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఇక షమీని ఔట్ చేయడంతో ఇండియా ఓటమి ఖాయమైపోయింది. షమీకి స్లో టాస్ వేయగా హిట్ చేయాలని చూసి ఔటయిపోయాడు. అంతవరకు షమీ, జడేజా జోడి కాస్త ఇంగ్లాండ్‌ను ఎదుర్కునేలా కన్పించింది. కానీ షమీ ఔటయ్యాక, లివింగ్‌స్టన్ బౌలింగ్లో జడేజా (29పరుగులు 44బంతుల్లో) కూడా బౌల్డ్ అవ్వడంతో ఇండియా ఆశలు వదులుకుంది. ఇక మధ్యలో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (29) పోరాటం కనబర్చినా అది సరిపోలేదు.

ఎప్పటిలాగే నిరాశపర్చిన కోహ్లీ

ఎప్పటిలాగే నిరాశపర్చిన కోహ్లీ

క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ మూడు చూడచక్కని ఫోర్లు కొట్టి కాసేపు అలరించాడు. కానీ డేవిడ్ విల్లీ బౌలింగ్లో కోహ్లీ (16పరుగులు 25బంతుల్లో 3ఫోర్లు) కూడా ఎప్పటిలాగే వైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను కవర్స్‌లో ఆడబోయే కట్ కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ఇక 31పరుగులకే 4వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డది. ఇక తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు పడడంతో గెలుపు దూరమైంది. ఇంగ్లాండ్ బౌలర్లు పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకున్నట్లు కన్పించింది. ఇక ఈ మ్యాచ్లో ఇండియా ఓటమితో సిరీస్ 1-1తేడాతో సమమైంది. సిరీస్ డిసైడర్ అయిన మూడో మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3.30కు జరగనుంది.

తుది జట్లు :

తుది జట్లు :

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

Story first published: Friday, July 15, 2022, 7:16 [IST]
Other articles published on Jul 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+