Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ind vs Eng 2nd ODI : కొంపకూల్చిన చాహల్.. కొంపముంచిన ప్రసీద్.. మంచి స్కోరు చేసిన ఇంగ్లాండ్..!

chahal

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డేలో యుజ్వేంద్ర చాహల్ దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49ఓవర్లకు 246పరుగులు చేసి ఆలౌట్ అయింది. యుజీకి తోడు హార్దిక్ పాండ్యా 2, బుమ్రా 2 చెలరేగారు. షమీ 1, ప్రసీద్ ఒక వికెట్ తీశారు. ఇంగ్లాండ్ 200పరుగుల లోపే ఔటయ్యేది కానీ ప్రసీద్ కృష్ణ చెత్త ఫీల్డింగ్‌తో డేవిడ్ విల్లీ ఇచ్చిన క్యాచ్ మిస్ చేశాడు. ఇక ఇంగ్లాండ్ టీంను మొయిన్ అలీ (47పరుగులు 64బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు), డేవిడ్ విల్లీ (41పరుగులు 49బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) ఆదుకుని గట్టెక్కించారు. ఆ జట్టు బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. జాసన్ రాయ్ ((23పరుగులు 33బంతుల్లో 2ఫోర్లు 1సిక్సర్)‌, జానీ బెయిర్ స్టో (38పరుగులు 38బంతుల్లో 6ఫోర్లు), జోరూట్ (11పరుగులు 21బంతుల్లో), స్టోక్స్ (21పరుగులు 23బంతుల్లో 3ఫోర్లు), బట్లర్ (4) తమ మార్క్ ఆట చూపించలేకపోయారు. ఈ దశలో ఇంగ్లాండ్ 102పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

కాసేపు అలరించిన లివింగ్ స్టోన్
5వికెట్లు కోల్పోయాక క్రీజులో లివింగ్ స్టోన్, మొయిన్ అలీ కాస్త బాధ్యతాయుతంగా ఆడారు. ఒక ఎండ్‌లో మొయిన్ అలీ డిఫెన్స్ ఆడుతుంటే.. మరో ఎండ్‌లో లివింగ్ స్టోన్ తనదైన ఎటాకింగ్ గేమ్ ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 46పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న లివింగ్ స్టోన్‌ను హార్దిక్ పాండ్యా బుట్టలో వేశాడు. 29వ ఓవర్లో హార్దిక్ బౌలింగ్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన లివింగ్ స్టోన్ (33పరుగులు 33బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) చివరి బంతికి హిట్టింగ్ చేసి క్యాచ్ ఔటయ్యాడు.

జిడ్డు ఫీల్డింగ్, మబ్బు బౌలింగ్
ఎప్పటిలాగే ఇంగ్లాండ్‌ను టెయిలెండర్ డేవిడ్ విల్లీ ఆదుకున్నాడు. అయితే అతను 1 పరుగు వద్ద హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను ప్రసీద్ జారవిడిచాడు. ప్రసీద్ జిడ్డూ ఫీల్డింగ్ వల్ల అతను క్రీజులో కుదురుకుని ఏకంగా 41పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ ప్రసీద్ పెద్దగా ప్రభావం చూపలేదు. 8ఓవర్లలో 53పరుగులు ఇచ్చాడు. ఇక మొయిన్ అలీ, డేవిడ్ విల్లీ చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తూ ఆడారు. వీరిద్దరూ అడపాదడపా ఫోర్లు బాదుతూ స్కోరు బోర్డును సజావుగా నడిపించారు. 7వ వికెట్‌కు ఏకంగా 89పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిద్దరి జోడీని చాహల్ విడదీశాడు. చాహల్ వేసిన బంతిని హిట్ చేయాలని చూసిన మొయిన్ అలీ రవీంద్రా జడేజా చేతికి చిక్కాడు. ఇక అనంతరం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఇంకా ఎక్కువ సేపు సాగలేదు. బ్రైడన్ కార్స్ (2), టోప్లే (3) ఇలా అచ్చి అలా వెళ్లిపోవడంతో 246పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌటైంది. ఇక 247పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0)డకౌట్ అయ్యాడు. టోప్లే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

తుది జట్లు :
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

Story first published: Thursday, July 14, 2022, 23:22 [IST]
Other articles published on Jul 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+