Ind vs Eng 2nd ODI : తిప్పేస్తున్న చాహల్.. మళ్లీ కష్టాల్లో పడ్డ ఇంగ్లాండ్, కమాండింగ్ పొజిషన్లో ఇండియా..!

ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డే జరుగుతుంది. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లాండ్.. రెండో వన్డేలో కాస్త పట్టుదల కనబర్చుతున్నా.. చాహల్ ఆ జట్టు టాపార్డర్‌ను దెబ్బతీశాడు. ప్రమాదకరంగా మారుతున్న జానీ బెయిర్ స్టో (38పరుగులు 38బంతుల్లో 6ఫోర్లు), జోరూట్ (11పరుగులు 21బంతుల్లో), స్టోక్స్ (21పరుగులు 23బంతుల్లో 3ఫోర్లు)లను చాహల్ ఔట్ చేశాడు. బెయిర్ స్టో క్లీన్ బౌల్డ్ కాగా.. రూట్, స్టోక్స్ క్లీన్ ఎల్బీడబ్ల్యూగా ఔటయి పెవిలియన్ బాటపట్టారు. ఇక రూట్ రివ్యూ కోరుకున్నా ఫలితం మాత్రం ఇండియా వైపే వచ్చింది. ఇక అంతకుముందు జాసన్ రాయ్ (23పరుగులు 33బంతుల్లో 2ఫోర్లు 1సిక్సర్)ను హార్దిక్ పాండ్యా తన బౌలింగ్లో క్యాచ్ ఔట్‌గా బురిడి కొట్టించాడు. బట్లర్ (4)ను షమీ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 24ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 116పరుగులు చేసింది. క్రీజులో లివింగ్ స్టోన్ (12), మొయిన్ అలీ (4) ఉన్నారు.

వచ్చిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకోలేని రాయ్, బట్లర్
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇకపోతే తొలి మ్యాచ్‌కు గజ్జలో గాయం కారణంగా దూరమైన కోహ్లీ.. తిరిగి రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఇక బౌలింగ్‌కు దిగిన ఇండియాకు ఎప్పటిలాగే బుమ్రా, షమీ తమ తొలి స్పెల్‌లో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. అయితే జాసన్ రాయ్ షమీ బౌలింగ్లో చాలా తడబడుతూ కన్పించాడు. ఇక కాసేపు మొండిగా బెయిర్ స్టో, జాసన్ రాయ్ క్రీజులో నిలబడాలని చూశారు. వీరిద్దరూ ఈ క్రమంలో అడపాదడపా బౌండరీలు బాదారు. 5వ ఓవర్లో రాయ్ ఫోర్, సిక్స్ కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కన్పించాడు. ఇక 7వ ఓవర్లో అప్పుడే సెకండ్ స్లిప్ తీసేయగా.. బెయిర్ స్టో.. షమీ బౌలింగ్లో ఫ్లిక్ చేశాడు. అది ఎడ్జ్ అయి సెకండ్ స్లిప్ గుండా ఫోర్ పోయింది. 8వ ఓవర్ బుమ్రా బౌలింగ్లో రాయ్ కాట్ అండ్ బౌల్ మిస్సయ్యాడు. వీరిద్దరూ తమకు వచ్చిన లైఫ్‌లను సద్వినియోగం చేసుకోలేకపోయారు.

ఓపెనింగ్ జోడీని విడదీసిన హార్దిక్ పాండ్యా
9వ ఓవర్లో బౌలింగ్ అందుకున్న హార్దిక్ బౌలింగ్లో బెయిర్ స్టోకు బంతి పొత్తి కడుపులో తగిలింది. కాసేపు బెయిర్ స్టో సఫర్ అయ్యాడు. ఫిజియోలు వచ్చి చికిత్స అందించడంతో తిరిగి బ్యాటింగ్ చేశాడు. అదే ఓవర్లో జాసన్ రాయ్ ఫైన్ లెగ్‌లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్‌కు ఔటయిపోయాడు. దీంతో 41పరుగుల వద్ద ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత రూట్ క్రీజులోకి వచ్చాడు. ఇక ప్రసీద్ క్రిష్ణ, హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను జానీ, రూట్ సమర్థంగా ఎదుర్కోగలిగారు. ఇక చాహల్ స్పెల్లోకి దిగగా.. హిట్ చేయాలని చూసిన బెయిర్ స్టో బౌల్డ్ అయ్యాడు

తెలివిగా స్టోక్స్‌ను బురిడీ కొట్టించిన చాహల్
ఆ తర్వాత రూట్ కూడా చాహల్ వేసిన 18వ ఓవర్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇక షమీ వేసిన 19వ ఓవర్లో కెప్టెన్ బట్లర్ సైతం బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత చాహల్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ఆడుతూ.. ఫోర్లు బాదిని స్టోక్స్.. పదే పదే అలాంటి షాట్లు ఆడుతుండడంతో చాహల్ తెలివిగా ఎల్బీడబ్ల్యూతో బురిడి కొట్టించాడు. అటాకింగ్ గేమ్ ఫార్ములాను నమ్ముకున్న స్టోక్స్ పదే పదే విఫలమవుతున్నా తన పంతా మార్చుకోవట్లేదు. దీంతో 102పరుగులకే 5వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఇక మొయిన్ అలీ, లివింగ్ స్టోన్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తుది జట్లు :
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్/ కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడన్ కార్సే, రీస్ టోప్లీ
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications