Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: శుభ్‌మన్‌ గిల్‌కే టెస్ట్ పగ్గాలు.. శ్రేయస్ అయ్యర్‌కు దక్కని చోటు

IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియా జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశం ద్వారా జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శుభ్‌మన్ గిల్‌ను ఇప్పుడు టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్‌ టీమిండియాకు నాల్గవ అతిపిన్న వయస్కుడైన కెప్టెన్ అయ్యాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్‌ను జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు.

మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్‌‌లకు లభించని అవకాశం
ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌లకు ఇంగ్లాండ్ పర్యటనకు అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025లో షమీ ప్రత్యేకంగా ఏమి చేయలేకపోవడమే దీనికి కారణం. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ అతడిని జట్టులో చేర్చకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

IND vs ENG 2025 Shubman Gill Named Test Captain Shreyas Iyer Left Out

సాయి సుదర్శన్-కరుణ్ నాయర్‌లకు దక్కిన చోటు
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తరఫున సంచలనం సృష్టించిన సాయి సుదర్శన్ జట్టులోకి ఎంపికయ్యాడు. ఇప్పటివరకు సీజన్ 18లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సాయి సుదర్శన్ నిలిచాడు. ఇది కాకుండా, దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్ 7 సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియాలో ఎంపికయ్యాడు.

ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన భారత జట్టు ఇదే..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్( వికెట్ కీపర్,వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్‌ దీప్, కుల్‌దీప్ యాదవ్

ఇండియా vs ఇంగ్లాండ్ సిరీస్ పూర్తి షెడ్యూల్ ఇదే..
మొదటి టెస్ట్ మ్యాచ్ (జూన్ 20-24)
రెండవ టెస్ట్ మ్యాచ్ (జూలై 2-6)
మూడవ టెస్ట్ మ్యాచ్ (జూలై 10-14)
నాల్గవ టెస్ట్ మ్యాచ్ (జూలై 23-27)
ఐదవ టెస్ట్ మ్యాచ్ (జూలై 31-ఆగస్టు 4)

Story first published: Saturday, May 24, 2025, 14:05 [IST]
Other articles published on May 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+