
కీలక సిరీస్‌లకు కేఎల్ రాహుల్ దూరం..
రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. లీసెస్టర్‌షైర్ కౌంటీ క్లబ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. కుర్రాళ్లతో కూడిన మరో జట్టు ఐర్లాండ్‌కు బయలుదేరి వెళ్లింది. ఐర్లాండ్ టీమ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఈ రెండింట్లోనూ కేఎల్ రాహుల్ సభ్యుడు కాడు. ఆయా సిరీస్‌లకు అతను దూరం అయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌కూ అందుబాటులో లేకుండా పోయిన విషయం తెలిసిందే. గజ్జల్లో గాయంతో అతను బాధపడుతున్నాడు.

వైస్ కేప్టెన్ గాయాలపాలు
దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభం కావడానికి ముందే అతను గాయపడ్డాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షల అనంతరం జర్మనీకి బయలుదేరి వెళ్లాడు. కనీసం రెండువారాల పాటు అతను చికిత్స తీసుకునే అవకాశం ఉంది. దీని తరువాత విశ్రాంతి తీసుకోక తప్పదు. ఇంగ్లాండ్ సిరీస్‌ను ముగించుకున్న వెంటనే భారత జట్టు అటు నుంచి అటే వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. ఈ పర్యటన నాటికి కేఎల్ రాహుల్.. గాయం నుంచి కోలుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ భావిస్తోంది.

జర్మనీలో చికిత్స..
అందుకే ట్రీట్‌మెంట్ కోసం అతణ్ని మెరుగైన చికిత్స కోసం జర్మనీకి పంపించింది. ఇదివరకు కండరాల నొప్పితో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్, వెస్టిండీస్, శ్రీలంకతో టెస్ట్, టీ20 సిరీస్‌లకు దూరం అయ్యాడు. రిస్ట్ గాయం వల్ల ఆస్ట్రేలియాతో సిరీస్‌నూ మిస్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20, ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌ల నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అతని ట్రీట్‌మెంట్ మీద ఆధారపడి ఉంది.

టీమిండియాకు నష్టమే..
కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడం టీమిండియాకు నష్టమేనని భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. 2021 నాటి భారత్- ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో రాహుల్ 315 పరుగులు చేశాడని, లార్డ్స్ మ్యాచ్‌లో సెంచరీ కూడా చేశాడని గుర్తు చేశారు. చేతేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారితో మిడిలార్డర్ బ్యాటింగ్ లైనప్ బాగున్నప్పటికీ.. నిలకడ అనేది అవసరమౌతుందని చెప్పారు. రాహుల్ నిలకడగా రాణించగల బ్యాటర్ అని కితాబిచ్చాడు.

రోహిత్-రాహుల్ కాంబో..
రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్ కాంబినేషన్ ఇంగ్లాండ్ గడ్డపై రాణించిందని చెప్పారు. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 2-1తో ఆధిక్యతను సాధించడానికి ఈ కాంబినేషన్ హెల్ప్ చేసిందని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్ అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరమేనని చెప్పారు. ఈ లోటును భర్తీ చేయడానికి చేతేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి నిలదొక్కుకోవాల్సి ఉంటుందని చెప్పాడు.


Click it and Unblock the Notifications
