For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ ద్రావిడ్‌‌కు రెస్ట్: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్: ఆ సిరీస్ కోసం

IND vs ENG 2022 first T20: VVS Laxman will be the head coach of the Team India

లండన్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో కొనసాగుతున్న అయిదో టెస్ట్ మ్యాచ్‌పై భారత జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్‌లో కాస్త తడబడినప్పటికీ.. ఆ తరువాత నిలదొక్కుకుంది. రెండో ఇన్నింగ్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ వికెట్లను కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి చేతేశ్వర్ పుజారా-50, తొలి ఇన్నింగ్ సెంచరీ హీరో, వికెట్ కీపర్ రిషభ్ పంత్-30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

7 నుంచి టీ20

7 నుంచి టీ20

ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యతలో ఉంది భారత్. ఇంకో రెండు రోజుల మ్యాచ్ మిగిలివుంది. మంగళవారం నాటితో ముగుస్తుంది. దీని తరువాత టీమిండియా టీ20 సిరీస్‌కు సిద్ధమౌతుంది. ఇంగ్లాండ్ జట్టుతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడుతుంది. అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో తలపడుతుంది.

వైట్ బాల్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ 7వ తేదీన ఆరంభమౌతుంది. సౌథాంప్టన్‌లోని ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్‌, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి.

టీమ్ ఇదే..

టీమ్ ఇదే..

తొలి టీ20 మ్యాచ్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది కూడా. దీనికి రోహిత్ శర్మ కేప్టెన్. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ సెలెక్ట్ అయ్యారు.

రాహుల్ ద్రావిడ్‌కు రెస్ట్..

రాహుల్ ద్రావిడ్‌కు రెస్ట్..

కాగా- ఈ మ్యాచ్ కోసం హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు విశ్రాంతి ఇచ్చింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. అతని స్థానంలో హైదరాబాదీ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్‌ను ఎంపిక చేసింది. తొలి టీ20 మ్యాచ్ కోసం హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను అపాయింట్ చేసింది. ప్రస్తుతం అతను టీమిండియా జూనియర్ల జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. అతని సారథ్యంలోనే టీమిండియా జూనియర్లు- ఐర్లాండ్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు.

వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా

వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా

డబ్లిన్ స్టేడియంలో కిందటి నెల జరిగిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్‌లో విజయఢంకా మోగించారు. హార్దిక్ పాండ్యా కేప్టెన్సీలో యంగ్ టీమిండియా ఈ సిరీస్‌ను గెలుచుకుంది. సగర్వంగా ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టింది. ప్రస్తుతం టీ20 వార్మప్ మ్యాచ్‌లను ఆడుతోంది. డెర్బిషైర్, నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్లబ్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లకు వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కేప్టెన్. ఇదే దూకుడును కొనసాగిస్తుందనే ఉద్దేశంలో బీసీసీఐ ఉంది. అందుకే- హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ను రీఅపాయింట్ చేసింది.

Story first published: Monday, July 4, 2022, 13:50 [IST]
Other articles published on Jul 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+