Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు బిగ్ రిలీఫ్: హజ్ యాత్రకు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్: ఆ సిరీస్‌కు దూరం

IND vs ENG 2022: Adil Rashid is all set to miss the white ball series against India

లండన్: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న భారత క్రికెట్ జట్టుకు ఓ గుడ్‌ న్యూస్. టీమిండియాతో జరగబోయే వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఆదిల్ రషీద్ దూరం కానున్నాడు. ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాను సందర్శించనున్నాడు. దీనికోసం అతను విరామం తీసుకున్నాడు. భారత్‌తో తలపడబోయే జట్టు కోసం తనను ఎంపిక చేయొద్దని ఆదిల్ రషీద్‌.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. దీనిపై ఈసీబీ సానుకూలంగా స్పందించింది. హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లడానికి అనుమతులు మంజూరు చేసింది.

 యార్క్‌షైర్ నుంచి కూడా..

యార్క్‌షైర్ నుంచి కూడా..

పవిత్ర మక్కా మసీదును సందర్శించడానికి ఈ 34 సంవత్సరాల లెగ్ స్పిన్నర్ కమ్ బ్యాటర్ త్వరలోనే సౌదీ అరేబియాకు భార్యతో సహా బయలుదేరి వెళ్లనున్నాడు. దీనికోసం కౌంటీ క్లబ్ యార్క్‌షైర్‌ నుంచి కూడా తాత్కాలికంగా తప్పుకొన్నాడు. టీమిండియాతో సిరీస్‌తో పాటు యార్క్‌షైర్ తరఫున టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లోనూ అతను పాల్గొనాల్సి ఉంది. టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్ నుంచి కూడా అతను ఇదివరకే విరామం తీసకున్నాడు. ఇప్పుడు తాజాగా ఈసీబీ కూడా అతనికి అనుమతులు ఇచ్చింది.

హజ్ యాత్ర కోసం..

హజ్ యాత్ర కోసం..

హజ్ యాత్ర కోసం తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని, బిజీ షెడ్యూల్స్ వల్ల సాధ్యం కావట్లేదని ఆదిల్ రషీద్ చెప్పాడు. భారత్‌తో స్వదేశంలో జరిగే సిరీస్ సమయంలోనే హజ్ యాత్రకు వెళ్లడానికి ఈసీబీ నుంచి అనుమతులు లభించాయని అన్నాడు. టీమిండియాతో సిరీస్ కోసం తాను ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూశానని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో హజ్ యాత్రకు వెళ్లాల్సి రావడం తనను నిరుత్సాహానికి గురి చేయట్లేదని పేర్కొన్నాడు.

 ఈసీబీ నుంచి

ఈసీబీ నుంచి

ఈసీబీ అధికారులు, యార్క్‌షైర్ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధులతో తాను మాట్లాడానని, హజ్ యాత్ర గురించి వివరించానని ఆదిల్ రషీద్ చెప్పాడు. ఓ ముస్లింగా పవిత్ర హజ్ యాత్రను పూర్తి చేయాలనేది తన లక్ష్యమని వారికి వివరించానని అన్నాడు. తన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ జట్టులో ముస్లిం ప్లేయర్లకు ఎప్పుడూ గౌరవం లభిస్తుంటుందని అన్నాడు. తనతో పాటు మొయిన్ అలీ, సకిబ్ మహ్మద్ ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నామని గుర్తు చేశాడు.

మల్టీ ఫార్మట్ మ్యాచ్‌లు..

మల్టీ ఫార్మట్ మ్యాచ్‌లు..

ఇంగ్లాండ్‌లో ఆ దేశ జట్టుతో టీమిండియా ఓ టెస్ట్ మ్యాచ్ సహా మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌ను ఆడాల్సి ఉంది టీమిండియాకు. ఏకైక టెస్ట్ మ్యాచ్ జులై 1వ తేదీన ఆరంభమౌతుంది. బర్మింగ్ హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గతంలో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు కరోనా వైరస్ వల్ల వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ ఇది.

 వన్డే, టీ20లు ఇలా..

వన్డే, టీ20లు ఇలా..

దీని తరువాత మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతుంది. తొలి టీ20 మ్యాచ్ వచ్చేనెల 7వ తేదీన షెడ్యూల్ అయింది. ఏజెస్ బౌల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. 9, 10వ తేదీల్లో ఎడ్జ్‌బాస్టన్‌, ట్రెంట్ బ్రిడ్జ్‌ల్లో మిగిలిన రెండు టీ20 ఇంటర్నేషనల్స్ ఉంటాయి. అనంతరం రెండు వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్ మొదలవుతుంది. 12వ తేదీన ఓవల్, 14న లార్డ్స్‌లో ఈ రెండు మ్యాచ్‌లల్లో భారత్-ఇంగ్లాండ్ తలపడతాయి.

Story first published: Friday, June 24, 2022, 11:00 [IST]
Other articles published on Jun 24, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+