For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100 పరుగుల కోసం 1000 రోజులుగా విరాట్ కోహ్లీ వెయిటింగ్: మెడ మీద కత్తి పెట్టినట్టే

IND vs ENG 2022 3rd ODI: Virat Kohli wait for a century is now almost reaching 1000 days

లండన్: భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే కోసం రంగం సిద్ధమైంది. మంచెస్టర్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ఆడబోయే చివరి మ్యాచ్ ఇదే. అనంతరం వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది భారత జట్టు. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ రెండు దేశాల మధ్య సిరీస్ మొదలవుతుంది. అదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌ చేరుకుంటుంది. ప్రొటీస్‌తో సిరీస్ ఆడుతుంది ఇంగ్లాండ్.

ఉత్కంఠతగా మూడో వన్డే..

ఉత్కంఠతగా మూడో వన్డే..

ఇంగ్లాండ్‌ సిరీస్‌లో ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలను అందుకుంది టీమిండియా. టెస్ట్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమిపాలైంది. దాని తరువాత జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. వన్డే ఇంటర్నేషనల్స్‌ సిరీస్‌లో 1-1 తేడాతో సమవుజ్జీగా ఉంది. నిర్ణయాత్మక మూడో వన్డేలో ఫలితం ఎలా ఉంటుందనేది ఉత్కంఠతను రేపుతోంది.

కోహ్లీకి నైట్ మేర్

కోహ్లీకి నైట్ మేర్

ఇదిలావుండగా- టీమిండియా బ్యాటింగ్ వెన్నెముక విరాట్ కోహ్లీకి ఈ సిరీస్ నైట్ మేర్‌గా మారింది. టెస్ట్, టీ20, వన్డే ఇంటర్నేషనల్స్.. ఇలా మూడు ఫార్మట్లలోనూ విఫలం అయ్యాడు. ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి రెండో వన్డే ఇంటర్నేషనల్ వరకు ఒక్క భారీ ఇన్నింగ్ కూడా ఆడలేకపోయాడు. టీ20 సిరీస్‌లోనూ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగుల్లో 11, 20 పరుగులు చేశాడు. రెండో టీ20లో 1, మూడో టీ20లో కోహ్లీ వాటా 11 పరుగులు మాత్రమే.

రెండో వన్డేలో ఫెయిల్..

రెండో వన్డేలో ఫెయిల్..

గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరం అయ్యాడు. రెండో మ్యాచ్‌లో ఆడినా జట్టుకు అతని ఇన్నింగ్ ఏ మాత్రం హెల్ప్ కాలేదు. 25 బంతుల్లో మూడు ఫోర్లతో 16 పరుగులు చేశాడు.డేవిడ్ విల్లే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కోహ్లీ బలహీనత మీద దెబ్బకొట్టాడు విల్లే. ఆఫ్ స్టంప్‌ కాస్త దూరంగా వెళ్తోన్న బంతిని ఆడి.. అవుట్ అయ్యేలా చేశాడు. ఈ రకంగా అనవసరమైన షాట్ ఆడి అవుట్ కావడం విమర్శకుల నోళ్లకు మరింత పని చెప్పింది.

70 సెంచరీలు..

70 సెంచరీలు..

కోహ్లీ కేరీర్‌లో ఇప్పటివరకు 70 సెంచరీలు ఉన్నాయి. ఇందులో 43 వన్డే ఇంటర్నేషనల్స్‌లో చేసినవి. మిగిలిన 23 టెస్ట్ ఫార్మట్‌లో అందుకున్నవి. చివరి సెంచరీ 2019లో నమోదు చేశాడు. ఆ ఏడాది నవంబర్ 23వ తేదీన బంగ్లాదేశ్‌పై కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇక అంతే. అప్పటి నుంచి సెంచరీ కోసం ఎదురు చూస్తోనే ఉన్నాడు. చివరి సెంచరీ చేసి 967 రోజులవుతోంది. ప్రస్తుతం క్రికెట్ ఆడుతోన్న ఓ ప్రొఫెషనల్ ప్లేయర్ ఒక్క సెంచరీ కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూడటం ఇదే తొలిసారి.

1000 రోజులను అందుకోకూడదనుకుంటే..

1000 రోజులను అందుకోకూడదనుకుంటే..

ఆదివారం జరిగే మూడో వన్డేలో కూడా విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేకపోతే మాత్రం- 1000 రోజుల మార్క్‌ను అందుకుంటాడనడంలో సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే- వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో అతను ఆడట్లేదు. ఈ పర్యటనకు ఎంపిక కాలేదు. మళ్లీ విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి దిగబోయేది ఆసియా కప్ టోర్నమెంట్‌లోనే. ఈ లోగా 1000 రోజులు కూడా దాటేస్తాయి. ఇదో అవాంఛితమైన రికార్డ్. ఆ చెడ్డపేరు, ఆ చెత్త రికార్డు తన పేరు మీద ఉండకూడదనుకుంటే మాత్రం విరాట్ కోహ్లీ ఆదివారం నాటి మ్యాచ్‌లో సెంచరీ చేయక తప్పదు.

4,114 రోజుల్లో..

4,114 రోజుల్లో..

తన కేరీర్‌లో 4,114 రోజుల్లో విరాట్ కోహ్లీ 70 సెంచరీలు అందుకున్నాడు. 71వ సెంచరీ కోసం 967 రోజులుగా ఎదురు చూస్తోన్నాడు. 1000 రోజులుగా ఏ ఫార్మట్‌లో కూడా సెంచరీ చేయని వరల్డ్ క్లాస్ బ్యాటర్‌గా చరిత్రకు ఎక్కాలని ఎవరూ కోరుకోరు. మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మెడ మీద కత్తిపెట్టినట్టయింది. ఈ 1000 రోజుల రికార్డును దక్కకూడదనుకుంటే సెంచరీ చేసి తీరాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోన్నాడతను.

Story first published: Saturday, July 16, 2022, 10:07 [IST]
Other articles published on Jul 16, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+