Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీపై తేల్చేసిన రోహిత్ శర్మ: ఫామ్‌లో లేకపోవడం పట్ల..!

IND vs ENG 2022 2nd ODI: Virat Kohli doesnt need any reassurance, says Rohit Sharma

లండన్: లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే ఇంటర్నేషనల్‌లో ఘోరంగా పరాజయం పాలుకావడంపై టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టాప్ ఆర్డర్ నిలదొక్కుకోలేకపోయిందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ నిర్దేశించి 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలమని మొదట భావించామని, ఆ తరువాత లార్డ్స్ పిచ్ బౌలింగ్‌కు సహకరించిందని వ్యాఖ్యానించాడు. తమ ఇన్నింగ్‌లోనూ బౌలర్లు రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు.

 బ్యాటింగ్ వైఫల్యం..

బ్యాటింగ్ వైఫల్యం..

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భాతర జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49 ఓవర్లల్లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లు సత్తా చాటారు. స్టార్ స్పిన్ బౌలర్ యజువేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా రెండు, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఒకటి చొప్పున వికెట్లు తీసుకున్నారు. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ పోరాడలేదు.

 కోహ్లీపై క్రిటిక్స్..

కోహ్లీపై క్రిటిక్స్..

అందరి అంచనాలన తలకిందులు చేస్తూ విరాట్ కోహ్లీ మళ్లీ విఫలం అయ్యాడు. గాయం కారణంగా తొలి వన్డేలో ఆడని అతను ఈ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. 16 పరుగులకే వెనుదిరిగాడు. అవుట్‌సైడ్ ఆఫ్ బలహీనత వెంటాడింది. 25 బంతుల్లో మూడు ఫోర్లతో 16 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ.. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కోహ్లీ అవుట్ అయిన తీరుపై తీవ్రంగా విమర్శలు చెలరేగుతున్నాయి.

ఆందోళన చెందనక్కర్లే..

ఆందోళన చెందనక్కర్లే..

కోహ్లీ ఫామ్‌పై రోహిత్ శర్మ పెద్దగా ఆందోళన వ్యక్తం చేయట్లేదు. అతను మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని చెప్పాడు. సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతోన్నాడని, ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడని గుర్తు చేశాడు. తనను తాను నిరూపించుకుంటాడని చెప్పాడు. అతను ఎప్పట్లాగే మళ్లీ గాడిలో పడతాడని స్పష్టం చేశాడు. ఆ నమ్మకం తనకు ఉందని పేర్కొన్నాడు. టీమిండియాలో టన్నుల కొద్దీ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావడానికి ఒకటి లేదా రెండు భారీ ఇన్నింగ్ సరిపోతాయని వ్యాఖ్యానించాడు. అలాంటి ఇన్నింగ్స్‌ను త్వరలోనే విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి జాలువారడాన్ని తాము చూస్తామనే ఆశాభావాన్ని రోహిత్ శర్మ వ్యక్తం చేశాడు.

విల్లే క్యాచ్ డ్రాప్‌పై..

విల్లే క్యాచ్ డ్రాప్‌పై..

డేవిడ్ విల్లే క్యాచ్ డ్రాప్ చేయడంపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ. మ్యాచ్ గెలవాలంటే క్యాచ్ పట్టి తీరాల్సిందేనని, ఒక్క క్యాచ్ డ్రాప్ అయినా అది గెలుపోటములను తారుమారు చేస్తుందని పేర్కొన్నాడు. బౌలర్లను ప్రత్యేకంగా ప్రశంసించాడు. పరిస్థితులకు అనుగుణంగా బంతులను సంధించారని, పిచ్ కూడా దీనికి సహకరించిందని అన్నాడు. తమ వద్ద బౌలింగ్ ఆప్షన్లు చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించాడు.

Story first published: Friday, July 15, 2022, 9:40 [IST]
Other articles published on Jul 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+