Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాటింగ్ ప్యాడ్స్‌ను ఇలాక్కూడా వాడేస్తారేంటీ?: బుమ్రా ఇంకో 17 వికెట్లు తీస్తే..కొత్త రికార్డ్

IND vs ENG 2021: Pacer Bumrah was seen doing the bowling practice with his batting pads on

లండన్: క్రికెట్ ప్రేమికులు నెలన్నర రోజులుగా ఎదురు చూస్తోన్న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇంకో రెండు రోజులు.. బుధవారం మధ్యాహ్నానికి తొలి టెస్ట్ ఆరంభమౌతుంది. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు టాస్ పడుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగే సుదీర్ఘ సిరీస్ ఇది. దీనికోసం రెండు జట్లు కఠోర సాధన చేస్తోన్నాయి. ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాయి. దీనికి సంబంధించిన అప్‌డేట్స్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు అందిస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ద్వారా తెలియజేస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే కసితో ఉంది బ్రిటీష్ టీమ్. అసాధ్యమే అయినప్పటికీ- విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను వైట్ వాష్ చేయాలనే ఉద్దేశంలో ఉంది. భారత జట్టుపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదని భావిస్తోంది. కోహ్లీసేనపై ఇంగ్లాండ్ జట్టు 2-1 తేడాతో ఆధిక్యాన్ని సాధిస్తుందంటూ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ పీటర్ ట్రెగో అప్పుడే వార్నింగ్ బెల్స్ కూడా పంపించాడు. ఆధిపత్యాన్ని మార్చే సామర్థ్యం విరాట్ కోహ్లీకి ఉందనీ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లాండ్‌ జట్టును సొంతగడ్డపై ఓడించగలమని నిరూపించుకునేలా భారత జట్టు క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తోన్నారు. ప్రత్యేకించి- బౌలింగ్ డిపార్ట్‌మెంట్ వెన్నుముకగా చెప్పుకొనే స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగిస్తోన్నాడు. బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ధరించే ప్యాడ్స్‌ను కాళ్లకు కట్టుకుని మరీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తోన్నాడతను. దీనికి సంబంధించిన ఓ ఫొటోను బీసీసీఐ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేసింది. టీమిండియా నెట్ ప్రాక్టీస్‌లో ఎంతగా తలమునకలై ఉందో ఈ పిక్ చూస్తే అర్థమౌతోందని కామెంట్ చేసింది.

జస్‌ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్‌పై 100 వికెట్ల ల్యాండ్‌మార్క్‌కు సమీపంలో ఉన్నాడు. ఇంకో 17 వికెట్లను పడగొడితే అతను ఈ క్లబ్‌లో చేరతాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాల్సి ఉన్నందున.. ఈ సిరీస్‌లోనే అతను దీన్ని అందుకుంటాడనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. అదే జరిగితే- అతి తక్కువ ఇన్నింగుల్లో ఇంగ్లాండ్‌పై 100 వికెట్ల క్లబ్‌లో చేరిన తొలి భారత బౌలర్‌గా ఆవిర్భవిస్తాడు బుమ్రా. 25 టెస్ట్ మ్యాచుల్లో ఇంగ్లాండ్‌పై వంద వికెట్లను పడగొట్టిన బౌలర్ కపిల్ దేవ్. బుమ్రా విజ‌ృంభించితే ఈ రికార్డ్ చెరిగిపోతుంది. అలాగే- స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంకో 12 వికెట్లు పడగొడితే.. ఇంగ్లాండ్‌పై 100 వికెట్లను సాధించిన బౌలర్‌గా నిలుస్తాడు.

Story first published: Monday, August 2, 2021, 7:20 [IST]
Other articles published on Aug 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+