For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Bheemla Naik: పవన్ కల్యాణ్‌పై అభిమానాన్ని దాచుకోలేకపోయిన యంగ్ క్రికెటర్..ఇంగ్లాండ్ నుంచి

IND vs ENG 2021: Hanuma Vihari tweets on Pawan Kalyans upcoming movie as Bheemla Naik
Pspk Rana Movie : Bheemla Nayak On Fore, Says Hanuma Vihari | Ind Vs Eng

లండన్: భీమ్లా నాయక్.. ప్రస్తుతం టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న పేరు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్టామినా ఏమిటో..ఎలా ఉంటుందో.. మరోసారి ప్రూవ్ చేసిన పేరు. పవన్ కల్యాణ్ నటిస్తోన్న అప్ కమింగ్ మూవీకి సంబంధించిన ఓ చిన్న అప్‌డేట్ మాత్రమే ఇది. మలయాళ సూపర్‌హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను రీమేక్‌లో నటిస్తోన్నాడాయన. ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. జోరుగా షూటింగ్ సాగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ షేర్ చేసిన ఓ చిన్న వీడియో పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందానికి హద్దుల్లేకుండా చేస్తోంది.

ఈ వీడియోలో పవన్ కల్యాణ్ ఇన్‌స్పెక్టర్ గెటప్‌లో కనిపించారు. అయ్యప్పనుమ్ కోషియుమ్‌లో అయ్యప్పన్ నాయర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తోన్నారు. ఒరిజినల్ మూవీలో బిజూ మీనన్ నటించిన క్యారెక్టర్ అది. కోషి కురియన్‌గా కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా నటిస్తోన్నారు. రీమేక్‌లో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పేరు భీమ్లా నాయక్. ఆయన ధరించిన ఎస్ఐ గెటప్‌పైనా ఈ నేమ్‌బ్యాడ్జ్ కనిపిస్తుంది. 2022 సంక్రాంతికి భీమ్లా నాయక్ ఛార్జ్ తీసుకోబోతోన్నాడంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్.. కోట్లాదిమంది పవన్ కల్యాణ్ అభిమానులను ఇఫ్పటి నుంచే ఎదురు చూసేలా చేసింది.

ఈ ఫ్యాన్స్‌లో టీమిండియా టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి కూడా ఉన్నాడు. కాకినాడకు చెందిన హనుమ విహారి ఇదివరకు పవన్ కల్యాణ్‌ను కలిసి ఫొటోలు సైతం తీసుకున్నాడు. పవన్ కల్యాణ్ అప్‌కమింగ్ మూవీపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇచ్చిన ఈ అప్‌డేట్ హనుమ విహారిని కూడా ఆకాశంలో విహరింపజేసినట్టుంది. అందుకే- ఇంగ్లాండ్‌‌లో ఉన్నా పవన్ కల్యాణ్‌పై తనకు ఉన్న అభిమానాన్ని దాచుకోలేకపోయాడతను. ఈ వీడియో షేర్ అయిన వెంటనే.. భీమ్లా నాయక్, పవన్ కల్యాణ్, పీఎస్‌పీకే రానా అనే పేర్లను మెన్షన్ చేస్తూ ఓ ట్వీట్ వదిలాడు. భీమ్లా నాయక్ ఆన్ ఫైర్ అనే మెసేజీని పంపించాడు.

హనుమ విహారి.. టీమిండియా మెంబర్. ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లను ఆడబోతోన్నాడతను. తొలి టెస్ట్ వచ్చేనెల 4వ తేదీన నాటింగ్‌హామ్‌లో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం జట్టుతో పాటు అక్కడే ఉంటోన్నాడు. అయిదు టెస్ట్ మ్యాచ్‌ ఈ సిరీస్ సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగుతుంది. భీమ్లా నాయక్ లుక్ విడుదలైన వెంటనే తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌కు పని చెప్పాడు. పవన్ కల్యాణ్‌కు బెస్ట్ విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు.

Story first published: Wednesday, July 28, 2021, 7:32 [IST]
Other articles published on Jul 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+