For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి బెన్‌స్టోక్స్.. అవుట్: మానసిక వేదన..ఎప్పుడొస్తాడో తెలియదు

IND vs ENG 2021: All rounder Ben Stokes takes an indefinite break from all formats of cricket

లండన్: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కేరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో ఎలాంటి క్రికెటర్ కూడా తీసుకోని నిర్ణయం అది. భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కావడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు అతను ఇచ్చిన ఈ సమాచారం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కలవరపాటుకు గురి చేస్తోంది. ఆధునిక క్రికెట్‌లో..కేరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉండగా..అతను చేసిన ఈ ప్రకటను కారణమేంటనే విషయం ఆసక్తి రేపుతోంది.

అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచీ..

అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచీ..

అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటోన్నట్లు బెన్‌స్టోక్స్ ప్రకటించాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్‌కు తెలియజేశాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందనీ చెప్పాడు. ఆగస్టు 4వ తేదీ నుంచి భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కాబోతోన్న ఈ పరిస్థితుల్లో బెన్‌స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ క్రికెట్ జట్టులో బాంబును పేల్చినట్టయింది. సరిగ్గా నాలుగు రోజుల్లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్న ఈ పరిస్థితుల్లో అతను చేసిన ప్రకటన ఇంగ్లాండ్ జాతీయ జట్టును ఒత్తిడిలోకి నెట్టినట్టయింది.

 సుదీర్ఘ క్రికెట్..

సుదీర్ఘ క్రికెట్..

బెన్‌స్టోక్స్ కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతూ వస్తోన్నాడు. ప్రత్యేకించి- గత ఏడాది మొత్తం అతను ఇంటికి దూరం అయ్యాడు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వస్తోన్నాడు క్రికెట్ వల్ల. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఈ ఏడాది ఆరంభంలో భారత పర్యటన.. ఆ వెంటనే మళ్లీ ఐపీఎల్ 2021, అది ముగిసిన వెంటనే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు బెన్. పాకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. ఇక భారత్‌తో అయిదు టెస్టుల సిరీస్ ఈ బుధవారమే ట్రెంట్‌బ్రిడ్జిలో ప్రారంభం కానుంది. ఇది ముగిసిన వెంటనే ఐపీఎల్ సెకెండ్ ఫేస్, ఆ తరువాత టీ20 ప్రపంచకప్‌ను ఆడాల్సి ఉంది.

 దెబ్బకొట్టిన బయోబబుల్..

దెబ్బకొట్టిన బయోబబుల్..

క్రికెటర్లు ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు బయో సెక్యూర్ బబుల్‌ను అమలు చేస్తోన్నాయి. ఈ బయో బబుల్ వ్యవస్థ.. పరిమితంగా ఉండే ఓ కొత్త ప్రపంచం. షెడ్యూల్‌ను ప్రకటించిన తరువాత క్రికెటర్లందరూ అందులో వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఉన్న వారితోనే కాంటాక్ట్‌ చేయాల్సి ఉంటుంది. సపోర్టింగ్ స్టాఫ్, వారు బస చేసే హోటల్ సిబ్బంది.. ఇలా పరిమితంగా మాత్రమే ఉంటారందులో. చివరికి కుటుంబ సభ్యులకు కూడా దూరం కావాల్సి ఉంటుంది. ఇందులో ఇమడలేక పోవడం వల్లే బెన్‌స్టోక్స్ నిరవధిక విరామాన్ని తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

డిసెంబర్‌లో తండ్రి మరణం..

డిసెంబర్‌లో తండ్రి మరణం..

వాటన్నింటికీ మించి.. గత ఏడాది డిసెంబర్‌లో ఇంటి పెద్దను కోల్పోయాడు బెన్‌స్టోక్స్. అతని తండ్రి గెడ్ స్టోక్స్ 65 సంవత్సరాల వయస్సులో బ్రెయిన్ కేన్సర్‌తో సుదీర్ఘ కాలం పాటు పోరాడుతూ గత ఏడాది డిసెంబర్‌లో తుదిశ్వాస విడిచారు. ఇది కూడా బెన్‌స్టోక్స్‌ను మానసికంగా కుంగదీసి ఉంటుందనే వాదనలు ఉన్నాయి. తండ్రికి బ్రెయిన్ కేన్సర్ ఉందనే విషయాన్ని డాక్టర్లు ధృవీకరించిన సమయంలో కూడా బెన్ అందుబాటులో లేడు. అప్పుడతను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. ఆ సమాచారం తెలిసిన వెంటనే అతను అర్ధాంతరంగా పర్యటనను ముగించుకుని స్వదేశానికి వెళ్లాడు.

న్యూజిలాండ్‌లో కుటుంబం..

న్యూజిలాండ్‌లో కుటుంబం..

బెన్‌స్టోక్స్ కుటుంబం కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌లో నివసిస్తోంది. బెన్‌కు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే అతని కుటుంబం న్యూజిలాండ్‌లో స్థిరపడింది. దీనికి కారణం- గెడ్ స్టోక్స్ రగ్బీ కోచ్ కావడం. 1982-83 సీజన్‌లో వర్కింగ్ టౌన్ రగ్బీ లీగ్ క్లబ్‌కు ఆయన ప్రాతినిథ్యాన్ని వహించాడు. 2003లో న్యూజిలాండ్ క్లబ్‌కు కోచ్‌గా నియమితులయ్యారు. దీనితో ఇంగ్లాండ్‌లోని కంబ్రియా నుంచి తన కుటుంబాన్ని న్యూజిలాండ్‌కు తీసుకెళ్లాడు.

పూర్తి సహకారం..

పూర్తి సహకారం..

బెన్‌స్టోక్స్ కొంత మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాడని, అందువల్లే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ తెలిపాడు. ఈ కష్ట సమయంలో అతనికి బోర్డు పూర్తి సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చాడు. ఎన్ని రోజులైనా అతను విశ్రాంతి తీసుకోవచ్చని, ఈ విషయంలో అతనిపై ఎలాంటి ఒత్తిడీ ఉండబోదని హామీ ఇచ్చాడు. తాను మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడాలనుకుంటే అప్పుడు జట్టులో చేరొచ్చని స్పష్టం చేశాడు. తన నిర్ణయాన్ని నిరభ్యంతరంగా ప్రకటించినందుకు అతణ్ని అభినందిస్తున్నట్లు చెప్పాడు.

రీప్లేస్ ఎవరు?

రీప్లేస్ ఎవరు?

బలమైన టీమిండియాతో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కావడానికి నాలుగు రోజుల ముందు బెన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ జట్టును కలవరపాటుకు గురి చేస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. అతనికి ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాల్సిన అవసరం ఉందిప్పుడు. స్టోక్స్ స్థానాన్ని భర్తీ చేయదగ్గ ప్లేయర్ల కోసం అన్వేషిస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అతని స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే విషయంపై కసరత్తు చేస్తోంది. కొత్త ఆటగాడి పేరును వెంటనే ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. భారత్ వంటి బలమైన జట్టును ఢీ కొట్టే స్థాయి ఆటగాడి కోసం అన్వేషిస్తోంది. బెన్‌స్టోక్స్ విరామం తీసుకోవడం అటు ఐపీఎల్‌లో అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్ జట్టును కూడా ఇబ్బందులకు గురి చేసినట్టయింది. స్టోక్స్ స్థానంలో ఆ జట్టు కూడా రీప్లేస్‌ను వెదుక్కోవాల్సి వచ్చింది

Story first published: Saturday, July 31, 2021, 7:43 [IST]
Other articles published on Jul 31, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+