Virat Kohli: ఆ రికార్డ్‌కు ఒక్క విజయం దూరంలో టీమిండియా కెప్టెన్...టెస్ట్ సిరీస్‌తో ఆ దాహం తీరినట్టే!

లండన్: నెలన్నర రోజులుగా ఎదురు చూస్తోన్న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభానికి ముహూర్తం సమీపించింది. ఈ మధ్యాహ్నం తొలి టెస్ట్ ఆరంభమౌతుంది. భారత కాలమానం ప్రకారం.. 3:30 గంటలకు టాస్ పడుతుంది. సెప్టెంబర్ 14వ తేదీ వరకు సాగే సుదీర్ఘ సిరీస్ ఇది. దీనికోసం రెండు జట్లు కఠోర సాధన చేశాయి. ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ సాగించాయి. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ వైదొలగడం వల్ల ఇంగ్లాండ్ కాస్త బలహీనపడినట్టే కనిపిస్తోంది. అదే సమయంలో భారత్ కూడా గాయాలబారిన పడినప్పటికీ తిరుగులేని బ్యాకప్ బ్యాట్స్‌మెన్లు ఉన్నారు.

ఈ అయిదు టెస్టుల సిరీస్‌లో..
ఈ అయిదు టెస్టుల సిరీస్‌లో అనేక రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో మొదటిది విరాట్ కోహ్లీకి సంబంధించినది. ఇంకొక్క టెస్ట్ మ్యాచ్ గనక టీమిండియా గెలుపుపొందితే.. ఫోర్త్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా ఆవిర్భవిస్తాడు విరాట్ కోహ్లీ. ఆ విషయంలో అతను వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ క్లైవ్ లాయిడ్‌ను అధిగమిస్తాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ లాయిడ్‌తో సమానంగా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్‌గా ఉన్నాడు. క్లైవ్ లాయిడ్ తన కేరీర్‌లో 36 టెస్టుల్లో తాను ప్రాతినిథ్యాన్ని వహించిన వెస్టిండీస్ జట్టును గెలిపించాడు. విరాట్ కోహ్లీ కూడా అతనితో సమానంగా ఉంటోన్నాడు. టీమిండియా ఇంకొక్క విజయం సాధిస్తే- క్లైవ్ లాయిడ్‌ను అధిగమిస్తాడు విరాట్ కోహ్లీ.

కోహ్లీ కంటే ముందు.. ముగ్గురు
టెస్ట్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టెన్లుగా విరాట్ కోహ్లీ ముందు ముగ్గురు ఉన్నారు. దక్షిణాఫ్రికా మాజీ కేప్టెన్ గ్రీమ్ స్మిత్, ఆస్ట్రేలియా మాజీ స్కిప్పర్లు రికీ పాటింగ్, స్టీవ్ వా. ప్రస్తుతం టాప్-3లో కొనసాగుతున్నారు. స్మిత్ ఏకంగా 53 టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు విజయాలను అందించాడు. రికీ పాటింగ్-48, స్టీవ్ వా-41 టెస్ట్ మ్యాచుల్లో ఈ ఘనతను సాధించారు. ఇక వంతు విరాట్ కోహ్లీకి వచ్చింది. ప్రస్తుతం కోహ్లీ తన సారథ్యంలో 36 టెస్టుల్లో టీమిండియాను గెలిపించాడు. క్లైవ్ లాయిడ్‌తో కలిసి నాలుగో స్థానాన్ని పంచుకుంటోన్నాడు. ఇంకొక్క టెస్ట్ మ్యాచ్ గెలిస్తే.. లాయిడ్‌ను అధిగమిస్తాడు.

125 పరుగుల దూరంలో
టెస్టుల్లో విరాట్ కోహ్లీ 125 పరుగులు చేస్తే.. మరో ల్యాండ్‌మార్క్‌ను అందుకుంటాడు. 23,000 పరుగులకు సమీపంలో ఉన్నాడతను. 125 రన్స్ చేస్తే.. ఈ మైలురాయిని అధిగమిస్తాడు. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ మ్యాచుల్లో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా 22,875 పరుగులు చేశాడు. ఇక 125 పరుగులు చేయగలిగితే 23 వేల రౌండ్ ఫిగర్‌ను అందుకుంటాడు. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కావడం వల్ల విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ గడ్డ మీదే ఈ ఘనతను సాధించడం కేవలం లాంఛనప్రాయమే అవుతుంది. ఎన్ని టెస్టుల్లో అనేది వేచి చూడాల్సి ఉంటుంది. కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉంటే.. తొలి టెస్టులోనే అతను ఈ రెండు రికార్డులు కూడా అందుకోవడానికి అవకాశం ఉంది.

జో రూట్ కూడా..
ఈ అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు నేతృత్వాన్ని వహిస్తోన్న జో రూట్ పరిస్థితి కూడా ఇంతే. బ్రిటీష్ టీమ్ ఇంకొక్క టెస్ట్ మ్యాచ్‌ను గనక తన ఖాతాలో వేసుకోగలిగితే- జో రూట్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టన్‌గా అవతరిస్తాడు. ఈ విషయంలో అతను మాజీ స్కిప్పర్ మైఖెల్ వాన్‌ను అధిగమిస్తాడు. ఇప్పటిదాకా జో రూట్ కేప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు 26 టెస్టుల్లో విజయాలను అందుకుంది. ప్రస్తుతం అతను కూడా మైఖెల్ వాన్‌తో సమానంగా 26 టెస్టుల్లో తన జట్టును గెలిపించాడు. విరాట్ కోహ్లీ.. జో రూట్ ఇద్దరిలో ఎవరు తన జట్టును గెలిపించినా.. ఓ రికార్డ్‌ను అందుకున్నట్టవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications