For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో దారుణ ఓటమి.. మూడో టెస్టులో బద్దలైన రికార్డులు ఇవే!!

IND vs ENG: 2 Innings defeats under Virat Kohli captaincy, Here is 3rd Test records

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో శనివారం ముగిసిన మూడో టెస్టులో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. నాలుగో రోజైన శనివారం 212/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత జట్టు మరో 66 పరుగులు జోడించి.. మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్లు ఓలి రాబిన్‌సన్‌, క్రెయిగ్ ఓవర్టన్ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్‌ ఒక్క సెషన్‌ కూడా క్రీజులో నిలవలేకపోయారు. అందరూ ఇలావచ్చి అలా వెళ్లిపోయారు. మిడిల్ ఆర్డర్ దారుణంగా దెబ్బకొట్టడంతో భారత్ చివరికి 278 పరుగులకు ఆలౌటై.. ఇన్నింగ్స్‌ 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచులో పలు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఓసారి చూద్దాం.

ఇది 45వ సారి:

ఇది 45వ సారి:

భారత్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో టెస్టు మ్యాచ్‌లో ఓడిపోవడం ఇది 45వ సారి. ఈ జాబితాలో ఇంగ్లండ్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు ఇంగ్లండ్ జట్టు 63 మ్యాచులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్ (46), భారత్ (45), ఆస్ట్రేలియా (44), బంగ్లాదేశ్ (43), న్యూజీలాండ్ (39) వరుసగా ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీ‌లో టీమిండియా ఇలా ఇన్నింగ్స్ తేడాతో ఓడటం మాత్రం ఇది రెండోసారి. 2018లో మొదటిసారి లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చేతిలోనే భారత్ ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓడింది.

రెండోసారి మాత్రమే:

రెండోసారి మాత్రమే:

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ టాస్ గెలిచిన తర్వాత భారత్ జట్టు టెస్టు మ్యాచ్‌లో ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. 2020-21లో ఆస్ట్రేలియా‌తో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ టాస్ గెలిచినా.. భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు లీడ్స్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో కూడా కోహ్లీ టాస్ గెలిచాడు. భారత్ ఇన్నింగ్స్‌ 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జో రూట్‌కి కెప్టెన్‌గా ఇది 55వ టెస్టు కాగా.. ఇందులో 27 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ టీమ్‌ని గెలిపించాడు. ఈ క్రమంలో మైకేల్ వాన్ పేరిట ఉన్న 26 టెస్టు విజయాల రికార్డ్‌ని అతను బ్రేక్ చేశాడు. ఇక సిరీస్‌లో ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టుల్లోనూ జో రూట్ సెంచరీలు నమోదు చేశాడు. ఇది కూడా ఓ రికార్డే.

అండర్సన్ రికార్డు:

అండర్సన్ రికార్డు:

ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్.. ఇంగ్లీష్ గడ్డపై టెస్టుల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా అండర్సన్ నిలిచాడు. 94 టెస్టుల్లో అండర్సన్ ఈ ఘనత సాధించగా.. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్ 73 టెస్టుల్లోనే 493 వికెట్లతో ఈ రికార్డ్‌లో టాప్‌లో ఉన్నాడు. భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2018లో ఇదే ఇంగ్లండ్ జట్టుతో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత మళ్లీ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం ఇదే తొలిసారి.

సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్:

సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్:

భారత్ గెలవాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం కాగా.. లార్డ్స్‌లో జ‌రిగిన‌ రెండో టెస్ట్‌లో కోహ్లీసేన విజ‌యం సాధించింది. దాంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఇక లీడ్స్ వేదికగా శనివారం ముగిసిన మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ సిరీసును 1-1తో సమం చేసింది. మ‌రో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జ‌రుగాల్సి ఉంది. లండన్ వేదికగా సెప్టెంబర్ 2 నుంచి నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి చివరి టెస్ట్ జరగనుంది.

Story first published: Saturday, August 28, 2021, 21:04 [IST]
Other articles published on Aug 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+