Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు దడ పుట్టిస్తోన్న చెత్త ఛేజింగ్ రికార్డ్: ఇంగ్లాండ్ గడ్డపై గెలిచింది మూడుసార్లే

IND vs ENG 1st test: Highest successful chase by India in England is 173

లండన్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది. నాటింగ్‌హామ్ ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా సాగుతోన్న ఈ మ్యాచ్ చివరి రోజు.. భారత్ గెలవాంటే 157 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నాయి. భారత బ్యాట్స్‌మెన్లు దూకుడుగా మ్యాచ్ ఆడితే లంచ్ లోపే మ్యాచ్ ముగియడం ఖాయం. ఇంగ్లాండ్ బౌలర్లు కూడా విజృంభించడానికి అవకాశాలు ఉన్నాయి. పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడం వల్ల అండర్సన్ అండ్ కో చెలరేగ వచ్చనే విశ్లేషణలు వినిపిస్తోన్నాయి. అదే సమయంలో తొలి ఇన్నింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించకపోవడం కలవరపాటుకు గురి చేస్తోంది.

బౌలర్లకు అనుకూలంగా పిచ్..

బౌలర్లకు అనుకూలంగా పిచ్..

టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్, లోయర్ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా భారీ స్కోర్ చేయగలిగారు. ఇద్దరూ అర్ధసెంచరీలను కంప్లీ చేసుకున్నారు. వారిద్దరూ కుదురుకోకపోయి ఉంటే.. మ్యాచ్ స్వరూపం వేరుగా ఉండేది. తొలి ఇన్నింగ్‌లో టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్లు సత్తా చాటలేకపోవడం ఒకింత ఆందోళనకు గురి చేసేదే.

బౌలర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ మీద చివరి రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తి రేపుతోంది. మ్యాచ్‌ను ఉత్కంఠ భరితంగా మార్చివేసింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా తలో 12 పరుగులతో క్రీజ్‌లో నాటౌట్‌గా ఉన్నారు.

157 పరుగులు భారమౌతాయా?

157 పరుగులు భారమౌతాయా?

కేఎల్ రాహుల్ 26 పరుగులు చేసిన అవుట్ అయ్యాడు. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడతను. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా శుభారంభం చేయాలంటే ఇంకా 157 పరుగులు చేయాలి.

రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా తలో 12 పరుగులతో క్రీజ్‌లో నాటౌట్‌గా ఉన్నారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉన్నప్పటికీ.. చివరి రోజు చేయాల్సిన ఆ 157 పరుగులే భారీగా అనిపిస్తోంది అభిమానులకు. ఇంకా చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్నప్పటికీ.. లక్ష్యాన్ని అందుకుంటుందా? లేదా? అనే ఆందోళన నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు.

ఛేజింగ్‌లో చతికిల..

ఛేజింగ్‌లో చతికిల..

ఇంగ్లాండ్ గడ్డ మీద భారత క్రికెట్ జట్టు.. సెకెండ్ ఇన్నింగ్ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ కావడమే దీనికి కారణం. ఇప్పటిదాకా టీమిండియా.. తన ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది.. మూడుసార్లు మాత్రమే. లక్ష్య ఛేదనలో అందుకున్న అత్యధిక స్కోరు 173 పరుగులు. 1971లో ఓవల్‌లో భారత్ 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి.. విజయాన్ని అందుకుంది.

ఆ తరువాత 1986లో క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానంలో సెకెండ్ ఇన్నింగ్ ఆడుతూ 134 పరుగుల టార్గె‌ను అందుకుంది. ఆ తరువాత- 2007లో మాత్రమే మరోసారి టార్గెట్‌ను ఛేదించింది టీమిండియా. ఇదే ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియంలో ప్రత్యర్థి నిర్దేశించిన అతి తక్కువ స్కోరు 73 పరుగులను అందుకుంది. ఈ మూడు సందర్భాల్లో మాత్రమే టీమిండియా రెండోసారి బ్యాటింగ్ చేసి.. గెలిచింది.

డ్రాకు నో ఛాన్స్..

డ్రాకు నో ఛాన్స్..

ఇక తాజాగా గెలుపు చేతికి అందేంత దూరంలో నిలిచి ఉంది టీమిండియా. ఒకరోజంతా ఆట మిగిలి ఉన్నందున.. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడం ఖాయమే. గత చరిత్రను తిరిగేస్తే మాత్రం కొంత గుబులు పుడుతోంది. వాతావరణం మ్యాచ్ కొనసాగడానికి అనుకూలంగా ఉండటం వల్ల డ్రాగా ముగియడానికి ఎలాంటి అవకాశం లేదు. భారత్, ఇంగ్లాండ్‌లల్లో తొలి టెస్ట్ మ్యాచ్ విజేతగా ఎవరు నిలుస్తారనేది ఈ రాత్రికి తేలిపోతుంది. రికార్డులను పరిగణనలోకి తీసుకుంటే.. లక్ష్యం స్వల్పమే అయినప్పటికీ.. గెలుపు కోసం రెండు జట్లు కూడా హోరాహోరిగా పోరాడటం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Sunday, August 8, 2021, 11:29 [IST]
Other articles published on Aug 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+